తెలంగాణ

శ్రీచైతన్య స్కూల్‌‌లో దారుణం..

రచన: NK•••2 నిమిషాల పఠనం

నాచారం శ్రీచైతన్య స్కూల్‌లో దారుణం జరిగింది. హాస్టల్‌ వార్డెన్‌ విద్యార్థిపై పాశవికంగా దాడి చేశాడు. ఈ దాడిలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. చెవి కర్ణభేరి పగిలి రక్తస్రావం జరిగింది.

Nacharam: హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య స్కూల్‌ హాస్టల్ లో దారుణం జరిగింది. హాస్టల్‌ వార్డెన్‌ 8వ తరగతి చదువుతున్న విద్యార్థిపై పాశవికంగా దాడి చేశాడు. ఈ దాడిలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థి చెవి కర్ణభేరి పగిలి రక్తస్రావమైంది. వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అత్యంత అమానుషంగా దాడికి పాల్పడ్డ హాస్టల్ వార్డెన్ పై విద్యార్థి తల్లిదండ్రులు నాచారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

తమ కుమారుడికి అయిన గాయం చూసి తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. హాస్టల్ వార్డెన్ దాడిలో తమ కుమారుడికి 50శాతం వినికిడి లోపం ఏర్పడిందని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై వారు ఆందోళన చెందుతున్నారు.

కాగా, సెల్‌ఫోన్ దొంగిలించాడంటూ విద్యార్థిపై హాస్టల్ వార్డెన్ అత్యంత దారుణంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్కూల్ లో సంచలనం రేపింది. తోటి విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. అటు తమ పిల్లల భద్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

#Sri Chaitanya School#Nacharam#Hostel Warden#Ear Damaged#Student#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి