తెలంగాణ

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పూర్తికి డెడ్ లైన్ ఫిక్స్.. పనులపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు సొరంగం తవ్వకాల్లో అతిపెద్ద అడ్డంకి తొలగిపోయిందని, పనుల్లో ఊహించని పురోగతి కనిపిస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు

TG: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు సొరంగం తవ్వకాల్లో అతిపెద్ద అడ్డంకి తొలగిపోయిందని, పనుల్లో ఊహించని పురోగతి కనిపిస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన ‘షియర్ జోన్’ను దాటుకుని తవ్వకం యంత్రాలు ముందుకు సాగుతున్నాయని, ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

79 శాతం పనులు పూర్తి..

మొత్తం 43.968 కిలోమీటర్ల పొడవైన ఈ భారీ ప్రధాన సొరంగ మార్గంలో ఇప్పటి వరకు దాదాపు 79 శాతం తవ్వకం ప్రక్రియ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిందని మంత్రి వెల్లడించారు. గత ఆరు నెలల కాలంలోనే సుమారు 700 మీటర్ల మేర తవ్వకాలు జరిపినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంకా 9.1 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాల్సి ఉందని, నిరంతర పర్యవేక్షణతో పనుల వేగాన్ని రెట్టింపు చేస్తున్నామని చెప్పారు.

జర్మనీ టెక్నాలజీతో స్పీడప్..

ప్రస్తుతానికి రోజుకు సగటున 7 నుంచి 7.5 మీటర్ల చొప్పున సొరంగం పనులు సాగుతున్నాయని, దీనిని మరింత వేగవంతం చేసేందుకు అత్యాధునిక డ్రిల్లింగ్ బూమర్లు, ఎలక్ట్రిక్ లోడర్లు, హై-కెపాసిటీ ఎక్స్‌కవేటర్లను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. సొరంగం లోపల తవ్విన వ్యర్థాలు, రాళ్లను బయటకు తరలించేందుకు జర్మనీ నుంచి ప్రత్యేక లోకోమోటివ్ ఇంజిన్లను తెప్పిస్తున్నామని, అక్టోబర్ చివరి నాటికి అవి అందుబాటులోకి వస్తాయని వివరించారు. దీనివల్ల గతంలో 48 గంటల సమయం తీసుకున్న ఒక్కో నిర్మాణ సైకిల్ ఇప్పుడు 20 నుంచి 24 గంటలకు తగ్గిందని, త్వరలోనే దీన్ని 10 గంటల స్థాయికి కుదించి శరవేగంగా పనులు ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు స్పీడ్‌తో పాటు లోపల పనిచేసే కార్మికుల సేఫ్టీకి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు.

#Telangana#TG News#SLBC Tunnel#SLBC Project#Srisailam Left Bank Canal#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి