సినిమా

Mrunal Thaakur: ఆ ఒక్క ఫ్లాప్ వల్ల మృణాల్ ఠాకూర్‌కి తెలుగులో గ్యాప్ వచ్చినట్టేనా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Mrunal Thaakur: హీరోకి నాలుగు ఫ్లాపులొచ్చినా మళ్ళీ సాలీడ్ కంబ్యాక్ ఇచ్చి తన మార్కెట్‌ను నిలబెట్టుకుంటాడు. కానీ, హీరోయిన్ పరిస్థితి అలా కాదు. ఒక్క ఫ్లా్‌తో మళ్ళీ ఛాన్స్ దక్కించుకోవాలంటే చాలా నెలలు ఎదురుచూడాల్సి వస్తుంది. ప్రస్తుతం, మృణాల్ ఠాకూర్ పరిస్థితి కూడా ఇదే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. డెకాయిట్ తర్వాత మళ్ళీ తెలుగులో ఈ బ్యూటీ సైన్ చేయలేకపోయింది.

Mrunal Thaakur: హీరోకి నాలుగు ఫ్లాపులొచ్చినా మళ్ళీ సాలీడ్ కంబ్యాక్ ఇచ్చి తన మార్కెట్‌ను నిలబెట్టుకుంటాడు. కానీ, హీరోయిన్ పరిస్థితి అలా కాదు. ఒక్క ఫ్లా్‌తో మళ్ళీ ఛాన్స్ దక్కించుకోవాలంటే చాలా నెలలు ఎదురుచూడాల్సి వస్తుంది. ప్రస్తుతం, మృణాల్ ఠాకూర్ పరిస్థితి కూడా ఇదే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. డెకాయిట్ తర్వాత మళ్ళీ తెలుగులో ఈ బ్యూటీ సైన్ చేయలేకపోయింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పాపులారిటీని తెచ్చుకున్న మృణాల్ టాలీవుడ్‌లో సీతారామం ద్వారా ఎంట్రీ ఇచ్చి, తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత, నాని సరసన హాయ్ నాన్న, విజయ్ సరసన ది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో వరుసగా అవకాశాలు అందుకుంది. హాయ్ నాన్న కూడా హిట్ సినిమా. అయితే, ఫ్యామిలీ స్టార్ తర్వాత వెంటనే మరో తెలుగు సినిమా విడుదల కాకపోవడంతో ఆమెకు టాలీవుడ్‌లో గ్యాప్ వచ్చినట్టు అనిపించింది.

శ్రుతి హాసన్ తప్పుకోవడంతో అడవి శేష్ నటించిన డెకాయిట్ సినిమాలో మృణాల్ ఠాకుర్ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. శేష్‌కి కథ-స్క్రీన్‌ప్లే మీద బాగా పట్టుంది. అందుకే, ఈ సినిమా రిలీజ్‌కి ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కట్, చేస్తే సీన్ మొత్తం బాక్సాఫీస్ వద్ద మారిపోయింది. ఈ సినిమాలో ఉన్న కథ-కథనాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దీంతో, మృణాల్ కి తెలుగులో మళ్ళీ పడింది.

ఈ సినిమా తర్వాత మళ్ళీ కొత్త సినిమా కబురేది ఈ బ్యూటీ చెప్పలేదు. సహజంగానే ఒక సినిమా ఫ్లాప్ తర్వాత గ్యాప్ వస్తే ఇక ఆ భాషలో ఛాన్స్ దక్కాలంటే చాలా కష్టంగా మారుతుంది..సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. సౌత్‌లో ఇప్పటికైతే, ఈ బ్యూటీకి సంబందించిన కొత్త ప్రాజెక్ట్ చర్చలేవీ జరగడం లేదు. దీంతో, ఇక మృణాల్.. టాలీవుడ్‌కి దూరమైందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇటీవల, టాక్సిక్ రిలీజైయ్యాక కియారా అద్వానీ కూడా ఇప్పట్లో సౌత్ సినిమాను ఒప్పుకునే ఉద్దేశ్యం లేదన్నట్టుగా చెప్పింది. మంచి కథ..అది తనకి గ్యారెంటీగా హిట్ ఇస్తుందనుకుంటే తప్ప తెలుగు సినిమాను ఒప్పుకోనని సన్నిహిత వర్గాలకి చెప్పిందట. ఇప్పుడు, మృణాల్ పరిస్థితి కూడా ఇదేనా అన్నది తెలియాల్సి ఉంది.

#Mrunal Thaakur#Sitaramam#Hi Nanna#Family Star
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి