తెలంగాణ

Job Card: పల్లె ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త జాబ్ కార్డులకు ఇలా అప్లై చేయండి!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

Job Card: గ్రామీణ ప్రజలకు, వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, పంటల సాగు తగ్గడంతో ప్రస్తుతం పల్లెల్లో కూలీలకు పనులు దొరకని పరిస్థితి నెలకొంది

Job Card: గ్రామీణ ప్రజలకు, వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, పంటల సాగు తగ్గడంతో ప్రస్తుతం పల్లెల్లో కూలీలకు పనులు దొరకని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 18 జిల్లాల పరిధిలోని 265 మండలాల్లో కరవు ఛాయలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, ప్రజలు వలస వెళ్లకుండా గ్రామంలోనే పనుల చేసుకునే విధంగా వీబీ జీరాంజీ పథకం ద్వారా కొత్త జాబ్ కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించారు.

15 రోజుల్లోనే జాబ్ కార్డు..

ఉపాధి అవసరం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి ఈ పథకంలో చేర్పించే బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు అప్పగించింది. అప్లై చేసుకున్న అర్హులకు కేవలం 15 రోజుల్లోనే కార్డు అందజేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 52.46 లక్షల కుటుంబాలకు చెందిన 1.08 కోట్ల మందికి జాబ్ కార్డులు ఉండగా, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా వెంటనే అనుమతి ఇవ్వనున్నారు. ప్రతి గ్రామం నుంచి రోజుకు కనీసం 100 నుంచి 150 మందికి పని కల్పించడమే లక్ష్యంగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే విధానం ఇదే..

ఈ జాబ్ కార్డ్ కోసం అప్లై చేసుకునే వారికి కనీసం 18 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, పాస్‌పోర్ట్ సైజు ఫొటోను జతచేయాలి. అనంతరం పూర్తి చేసిన అఫికేషన్‌ను స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామ కార్యదర్శి వాటిని పరిశీలించి ఆ అప్లికేషన్స్‌ను ఎంపీడీవో కార్యాలయానికి పంపుతారు. అక్కడ అర్హతలను చెక్ చేసిన తర్వాత ఎంపీడీవో గ్రీన్ సిగ్నల్‌తో సరిగ్గా 15 రోజుల్లో జాబ్ కార్డు నేరుగా అప్లై చేసుకున్న వారి చేతికి అందుతుంది.

వారం రోజుల్లోనే బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు

ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం పలు సానుకూల మార్పులను అమలు చేస్తోంది. పని దినాల సంఖ్యను పెంచడంతో పాటు కనీస రోజువారీ కూలీ వేతనాన్ని కూడా పెంచింది. అంతే కాకుండా, పనులు పూర్తయిన వారం రోజుల్లోనే కూలీ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్స్‌లో జమ అయ్యేలా రూల్స్ రూపొందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో పల్లెల్లోని పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా తక్షణ ఉపశమనం లభించనుంది.

#Job Card#New Job Card Apply#Job Card Online Apply#Rural Employment Scheme#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి