Shiva Nirvana: దర్శకుడు శివ నిర్వాణ గురించే ఇప్పుడు సినీ పరిశ్రమలో ప్రముఖులంతా మాట్లాడుకుంటున్నారు. మాస్ మహారాజ్ రవితేజకి ఇరుముడి లాంటి సున్నితమైన కథ-కథనాలతో రూపొందిన సినిమాను చేసి భారీ హిట్ ఇచ్చాడు. దాదాపు మూడు నాలుగేళ్ళ నుంచి రవితేజ ఎదురుచూస్తున్న హిట్ ఇచ్చాడు శివ. ఈ కథ ఎవరికి పడ్డా..ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందో లేదో తెలీదు గానీ..రవితేజకి మాత్రం డిఫరెంట్‌గా పడింది. దీంతో, ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్స్ అందరూ ఆయనతో సినిమా చేయ్యాలని ట్రై చేస్తున్నారు.
కానీ, ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మాత్రం మరోసారి, న్యాచురల్ స్టార్ నాని తో సినిమా చేయడానికి కథ రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కబోతున్నట్లు కూడా తాజాగా ఫిలింనగర్ నుంచి అందుతున్న సమాచారం. గతంలో, నాని-శివ నిర్వాణ ల కాంబోలో వచ్చిన ‘నిన్ను కోరి’, ‘టక్ జగదీష్’ చిత్రాలు డీసెంట్ హిట్‌ని సాధించాయి. తర్వాత మళ్ళీ కుదరలేదు.
ఇరుముడి లాంటి భారీ హిట్ తర్వాత మూడోసారి కలిసి సినిమా చేసేందుకు ఇద్దరి మధ్యన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ-సమంతలతో చేసిన ‘ఖుషి’ వంటి సూపర్ హిట్ తర్వాత శివ నిర్వాణ, నాని కోసం ఒక ఎమోషనల్ కథను సిద్ధం చేశారని, ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే, ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇక, నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘ది ప్యారడైజ్’ విడుదల తర్వాత ప్రస్తుతం కాస్త బ్రేక్ తీసుకున్న నాని, సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ సినిమాను చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ సినిమాతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నాగవంశీ నిర్మించే మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించనున్నారు. ఇప్పుడు, కథల ఎంపికలో వేగం పెంచిన నాని, మళ్ళీ క్లాస్ చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే, హ్యాట్రిక్ మూవీని శివ నిర్వాణతో చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట.


