తెలంగాణ

Ktr: వారసత్వ కట్టడాలను కూల్చే కుట్రలు- రేవంత్ సర్కార్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

రచన: NK•••4 నిమిషాల పఠనం

Ktr: కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలను కూల్చే కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Ktr: కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలను కూల్చే కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తవ్వకాలు, బ్లాస్టింగ్స్ వల్ల రామప్ప ఆలయానికి ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.

భూముల లోపల ఉన్న సంపద దోపిడీ

తెలంగాణ శిల్పకళకు ప్రతిరూపం రామప్ప దేవాలయం అని చెప్పారు. రాష్ట్రంలో భూముల దోపిడీకి పాల్పడిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు భూముల లోపల ఉన్న సంపద దోచుకోవడంపై దృష్టి పెట్టిందన్నారు. వారసత్వ కట్టడాలను కూల్చడానికి కుట్రలు పన్నుతోందన్నారు. రామప్ప ఆలయానికి హాని కలిగించే ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సీఎం రేవంత్ ను హెచ్చరించారు కేటీఆర్.

రామప్ప ఆలయానికి, రామప్ప చెరువుకు తీవ్ర ముప్పు

''భూములు దోచుకోవడం అయిపోయింది.. ఇప్పుడు భూముల లోపల ఉన్న సంపద దోచుకొని, వారసత్వ కట్టడాలను కూల్చడానికి రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతుంది. రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడం దారుణం.

మీటర్ల కొద్ది లోతులో తవ్వకాలు, బ్లాస్టింగ్స్ చేయడం వల్ల తెలంగాణ శిల్పకళకు ప్రతిరూపం, యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి, రామప్ప చెరువుకు తీవ్ర ముప్పు వాటిల్లనుంది.

వారసత్వ సంపదను ధ్వంసం చేసే ఈ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి హాని చేసే ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం'' అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు కేటీఆర్.

#Ktr#Brs#Telangana Congress#Cm Revanth#Ramappa Temple#Swechaa News#Open Cast Coal Mine
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి