వైరల్ న్యూస్

వీడియో వైరల్: పోలీస్‌ స్టేషన్‌లో నాగు పాము పిల్లలు!..

రచన: Venu3 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఊహించని ఘటన కలకలం రేపింది. స్టేషన్ ప్రాంగణంలో ఫిర్యాదు దారులు వేచి ఉండే ప్రాంతంలోకి మూడు నాగుపాము పిల్లలు వచ్చాయి.

హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఊహించని ఘటన కలకలం రేపింది. స్టేషన్ ప్రాంగణంలో ఫిర్యాదు దారులు వేచి ఉండే ప్రాంతంలోకి మూడు నాగుపాము పిల్లలు రావడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్పందించి పాములను ప్లాస్టిక్ బకెట్‌లో బంధించి ప్రమాదాన్ని నివారించారు.

అనంతరం ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకుని పాములను సురక్షితంగా స్వాధీనం చేసుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అయితే ఈ ఘటనతో మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మూడేళ్ల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా ఏర్పాటు చేసిన ఈ స్టేషన్ ప్రస్తుతం ఎస్‌ఐఐటీకి చెందిన ఖాళీ స్థలంలో పనిచేస్తోంది. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను కూడా ఇదే ప్రాంగణంలో నిల్వ ఉంచుతున్నారు. కానీ స్థలం మొత్తం చెట్లు, పొదలతో నిండిపోవడంతో పాముల సంచారం పెరిగినట్లు తెలుస్తోంది.

తరచూ సర్పాలు స్టేషన్‌లోకి వస్తుండగా, వీధికుక్కలు కూడా గుంపులుగా తిరుగుతున్నాయి. దీంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, సందర్శకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే పరిసరాలను శుభ్రపరిచి, భద్రతా చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

#telangana#hyderabad#snakes#madhuranagar#police-station
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి