సినిమా

Bhagyashri Borse: తెలుగులోనే నా చివరి సినిమా..కన్నీళ్ళు పెట్టుకున్న భాగ్యశ్రీ

రచన: Anshu3 నిమిషాల పఠనం

Bhagyashri Borse: కొన్ని సినిమాలపైన విపరీతమైన అంచనాలుంటాయి. రిలీజ్ కి ముందే భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. తీరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాక కథ, కథనం బాగోలేక, దర్శకుడు సినిమాను సరిగ్గా నడింపచలేక, హీరో కథకి సూటవక..ఇలా పలు కారణాలతో సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలుస్తుంది.

ఇంకొన్ని సినిమాలు ఎన్నోసార్లు రక రకాల కారణాలతో వాయిదా పడుతు వస్తాయి. ఇలాంటి సినిమాలకి ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు, ఆసక్తి కూడా ఉండదు. ఇక, హీరోహీరోయిన్లకి గత సినిమాల ప్రభావం కూడా తోడై నెగిటివిటీ కూడా పెరుగుతుంది. అలాంటి సినిమానే అక్కినేని అఖిల్ నటించిన లెనిన్. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటించింది.

జూలై 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి..హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం గ్రాండ్‌గా సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే స్టేజ్ ఎక్కుతూనే చాలా ఎమోషనల్ అయింది. థియేటర్స్‌లో ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకి ఎంతో ఆనందపడుతూ ఈ సినిమా జర్నీ గురించి చెప్పింది.

తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి, ఆదరణకి కృతజ్ఞతలు చెప్తూ..నేను ఏ భాషలో ఎన్ని సినిమాలు చేసినా..నా చివరి సినిమా మాత్రం తెలుగులోనే ఉంటుందని ఎంతో ఎమోషనల్ అయింది. ఆ సమయంలో లెనిన్ టీమ్ ఆమెని ఉత్సాహపరుస్తూ కేరింతలు కొట్టారు. భాగ్యశ్రీ ఇండస్ట్రికొచ్చి చాలా కాలమే అయింది. కానీ, లెనిన్ తన కెరీర్ మొదటి సక్సెస్. అందుకే, ఇంతగా ఎమోషనల్ అయింది.

#bhagyasri boarse#lenin#akhil#nagarjuna
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి