సినిమా

Ramayana: ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..కానీ, మళ్ళీ డౌట్ ఎందుకు?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Ramayana: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మళ్ళీ పుంజుకుంది. చాలా ఏళ్ళ నుంచి సాలీడ్ హిందీ సినిమా రావడం లేదనే కామెంట్స్ వినిపించాయి. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన బాహుబలి ఫ్రాంఛైజీస్, పుష్ప ఫ్రాంఛైజీస్, సలార్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలను చూసి హిందీ వాళ్ళు షాకయ్యారు. అందుకే, తెలుగులో భారీ చిత్రం వస్తుందంటే అందరూ ఇటువైపే చూశారు.

మళ్ళీ, అనిమల్.. ఛావా.. ధురంధర్ ఫ్రాంఛైజీస్ లాంటి సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొడుతుంటే బాలీవుడ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. అలాంటి, ఇతిహాసం ఇప్పుడు హిందీలో రూపొందుతోంది. అదే, రామాయణ. ఇందులో రణబీర్ కపూర్ శ్రీ రాముడిగా, టాలీవుడ్ ఫిదా బ్యూటీ సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా కనిపించనుండటం గొప్ప విశేషం.

ఇక వీరితో పాటు బాలీవుడ్ నటులు సన్నీ డియోల్ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయి పాత్రల్లో నటిస్తున్నారు. ఇలాంటి భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న రామాయణపై బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంతకముందు వచ్చిన ఆదిపురుష్ లాంటి కొన్ని రామాయణ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఈ సినిమా అయినా మెప్పిస్తుందా? అనే నెగిటివ్ టాక్ వినిపించింది.

అందుకే, ఈ మూవీ ట్రైలర్ విషయంలో కూడా నెగిటివిటీ పెరిగింది. జూలై 18న రామాయణ ట్రైలర్ రిలీజ్ అనే ప్రచారం జరిగింది. దీనికి చెక్ పెడుతూ మేకర్స్ అధికారికంగా జూలై 24వ తేదీన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అని ఓ అద్భుతమైన పోస్టర్ రిలీజ్ చేసి కన్‌ఫర్మ్ చేసింది. దీంతో, ఆ ట్రైలర్ ఎలా ఉండబోతుందోననే ఆతృత ప్రతీ ఒక్కరిలో పెరిగింది. కాగా, రామాయణ పార్ట్ 1 2026 దీపావళికి, పార్ట్ 2.. 2027 కి రిలీజ్ అని మేకర్స్ ఆల్రెడీ కన్‌ఫర్మ్ చేశారు.

#ramayana#ranbeerkapoor#saipallavi#niteshtiwari
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి