తెలంగాణ

వియత్నాం దుర్ఘటనపై KLR దిగ్భ్రాంతి!..

రచన: Venu3 నిమిషాల పఠనం

వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం పట్ల కాంగ్రెస్ నేత, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 15 మంది తెలుగు టూరిస్టులు దుర్మరణం చెందడంపై కాంగ్రెస్ నేత, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆనందంగా, సంతోషంగా విదేశీ పర్యటనకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపడంపట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

వియత్నాంలో ఉన్న తెలుగు రాష్ట్రాల టూరిస్టులతో పాటు తెలంగాణ ప్రభుత్వ అధికారులతో కూడా తాను ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపిన లక్ష్మారెడ్డి.. అక్కడి పరిస్థితులపై నిరంతరం ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు..

తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉన్నతాధికారులు వియత్నాం ఎంబసీతో పాటు అక్కడి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. ప్రమాదంలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన పర్యాటకులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

అలాగే వియత్నాంలో ఉన్న తెలంగాణకు చెందిన సుమారు 40 మంది టూరిస్టులను సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.

#telangana#klr#congress#indian-tourists#boat#vietnam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి