సినిమా

Raveena Tandon: శర్వా సినిమాలో సీనియర్ నటి..?

రచన: Anshu3 నిమిషాల పఠనం

Raveena Tandon: టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఇటీవల బైకర్ సినిమాతో వచ్చి ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి భోగి. ఈ సినిమాను సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. మరో సినిమా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోంది. ఇందులో, హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే అంటున్నారు. కానీ, అధికారికంగా ఇంకా మేకర్స్ ప్రకటించలేదు.

ఇక, తాజాగా శ్రీను వైట్ల-శర్వానంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి సంబందించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సీనియర్ నటి రవీనాటాండన్ ని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట. 1980 - 1990 లలో అటు హిందీలో, ఇటు తెలుగులో రావీనాటాండన్ మంచి క్రేజీ హీరోయిన్. తెలుగు కంటే హిందీలో అప్పట్లో వరుసగా సినిమాలు చేసింది.

ఆ తర్వాత, కొంతకాలం గ్యాప్ తీసుకుంది. కన్నడలో యష్ నటించిన కేజీఎఫ్ 2 లో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది. మళ్ళీ, ఇప్పుడు తెలుగు సినిమాలో అవకాశం అందుకున్నట్టుగా సమాచారం. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్న శ్రీను వైట్ల ఆగడు డిజాస్టర్ తో మళ్ళీ కోలుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది. మధ్యలో ఢీ 2 అన్నారు. అది ఆగిపోయింది.

ఎట్టకేలకి, శర్వానంద్ హీరోగా సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే, ఓ షెడ్యూల్ కంప్లీట్ అయిందట. ఆగస్టు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోందని సమాచారం. ఈ షెడ్యూల్ లో రవీనాటాండన్ జాయిన్ అవుతుందని లేటెస్ట్ అప్‌డేట్. అంతేకాదు, పోలీస్ ఆఫీసర్ రోల్ ఆమె కనిపించనుందట. మేకర్స్ అధికారికంగా ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి. ఇక, ఈ సినిమాకి జార్జ్ క్రిష్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు.

#RaveenaTandon#GeorgeKrish#Sharwanand#Srinuvaitla
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి