సినిమా

Lenin Success Meet: తారక్ నా పెద్దబ్బాయి..నాగార్జున కామెంట్స్ వైరల్

రచన: Anshu4 నిమిషాల పఠనం

Lenin Success Meet: "తారక్ నా పెద్దబ్బాయి".. అంటూ నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం లెనిన్ సినిమా. మనం సినిమా క్లైమాక్స్ లో సాలీడ్ ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. తన ఎంట్రీ చూసి హాలీవుడ్ హీరోలా ఉన్నాడని అందరూ మాట్లాడుకున్నారు. ఆ క్రేజ్ తోనే "అఖిల్" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించాడు.

అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత అఖిల్ సినిమాలు చేస్తున్నాడు గానీ ఏదో అలా అలా నెట్టినవే తప్ప, ఒరిజినల్ హిట్ గా ఏదీ నిలవలేదు. "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్" సినిమా ఓ మోస్తరు హిట్ అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ కి సాలీడ్ హిట్ పడి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకోవాలని నాగార్జున కసితో 'లెనిన్' కథను సెలెక్ట్ చేశాడు.

ఏడాదిన్నర నుంచి అదుగో ఇదుగో అంటూనే ఎప్పటికప్పుడు 'లెనిన్' సినిమా షూటింగ్ డిలే అయి..రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకి జూలై 10వ తేదీన సినిమా గ్రాండ్ గా రిలీజైంది. అయితే, ఈ సినిమా రిలీజ్ కి ముందు తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి స్టూడియోకి వచ్చిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. అదే సమయంలో తారక్ ఇచ్చిన బూస్ట్ సినిమాకి అడిషనల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇప్పుడు, 'లెనిన్' సినిమా రిలీజైయ్యాక బిగ్ హిట్ అంటున్నారు.

ఈ నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరిపింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ, అడగ్గానే వాయిస్ ఓవర్ ఇచ్చిన తారక్ కి థాంక్స్. తను నా పెద్దబ్బాయి. అఖిల్, చైతూ నాకు రెండు కళ్ళు.. అని సంబరపడిపోయాడు. ఇదే వేదికపై హీరోయిన్ గురించి ఇతర టెక్నీషియన్స్ గురించి, మరో నిర్మాత నాగవంశీ గురించి నాగ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి.

#lenin#nagarjuna#jr.ntr#tarak#akhil#bhagyasriborse
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి