Janhvi Kapoor: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గురించి పరిచయం ఏమాత్రం అక్కర్లేదు. ధడక్ సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతో బాగానే ఆకట్టుకుంది. అయితే, అక్కడ స్టార్ హీరోయిన్‌గా మాత్రం నిలబడలేదు. శ్రీదేవికి తన కూతుర్లు సౌత్ ఇండస్ట్రీలలో స్టార్స్ గా వెలిగితే చూడాలనుకుంది.
ఆమె చనిపోయిన తర్వాత, తండ్రి బోనీ కపూర్ కి కూడా అదే కోరిక. అయితే, బాలీవుడ్ లో జాన్వీ ఎంట్రీ గ్రాండ్‌గా జరిగింది. కానీ, రావాల్సిన పేరు మాత్రం రాలేదు. తండ్రి బడా నిర్మాత. కరణ్ జోహార్ లాంటి సపోర్ట్ గట్టిగా ఉంది. అయినా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోతోంది. ఇదే, సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అమ్మడికి సాలీడ్ అవకాశాలు వచ్చాయి.
మొదటి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్‌టీర్ సరసన చేసింది. అదే దేవర. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ అంటే ఎవరూ నమ్మరు. కేవలం పాటల కోసమే అన్నట్టుగా ఉంది. గ్లామర్ కోసమే తప్ప, పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. దేవర సినిమాలో ఏమీ లేదు. అయినా, కూడా బుచ్చిబాబు సానా పెద్ది సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో..గ్లోబల్ వైడ్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమా.
కానీ, పెద్ది బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. పైగా, సినిమాలో ఐటమ్ భామగా కనిపించింది తప్ప..హీరోయిన్ గా కనిపించలేదు. పెద్ది సినిమా విషయంలో జాన్వీని బాగా ట్రోల్ చేశారు. అసలు, ఎందుకు ఆ రోల్ ఒప్పుకుందో అని విశ్లేషకులు మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ అయితే, ఇకపై జాన్వీ కపూర్ కి తెలుగు మేకర్స్ అవకాశాలివ్వాలంటే ఆలోచిస్తున్నారట. చేసిన రెండు సినిమాలు ఫ్లాపవడంతో నెగిటివ్ సెంటిమెంట్ పడిందని చెప్పుకుంటున్నారు.












