Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న్ పెళ్లి తర్వాత అందుకే కొత్త సినిమాలను ఒప్పుకోలేదా? అందుకే అంటే ఎదుకు..ఇదే ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో, అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ. ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రష్మిక ..అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పుష్ప ఫ్రాంఛైజీస్‌తో పాన్ ఇండియన్ స్టార్‌గా మారింది.
హిందీలో చేసిన అనిమల్ సినిమా అక్కడ బిజీ హీరోయిన్‌ని చేసింది. ఛావా, సికిందర్ సినిమాలతో ఆకట్టుకుంది. అయితే, కుబేర..ది గర్ల్ ఫ్రెండ్ లాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసి మెప్పించింది. ప్రస్తుతం, ఈ నేషనల్ క్రష్ చేతిలో ఉన్న సినిమాలు కేవలం రెండంటే రెండే.అవి కూడా పెళ్లికి ముందు సైన్ చేసినవి. వాటిలో మైసా..ఇంకోటి రణబాలి. మైసా సినిమా ఫీమేల్ సెంట్రిక్ మూవీ.
ఇప్పటికే, ఈ మూవీ నుంచి వచ్చిన రష్మిక మందన్న లుక్..ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను పెంచింది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మైసా రష్మిక కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సినిమాగా చెప్పుకుంటారని చాలా నమ్మకంగా ఉంది. ఇంకా, విడుదల తేదీ ప్రకటించనప్పటికీ, ఇదే ఏడాది రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతున్నారు.
ఇక, తన భర్త విజయ్ దేవరకొండ సరసన రణబాలి సినిమాను చేస్తోంది. ఇవి, తప్ప కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ సైన్ చేయలేదు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలే గానీ, అన్నీ భాషల్లో భారీ చిత్రాలు కనీసం అరడజనుకి పైగా ముందుంటాయి. కానీ, పెళ్లి తర్వాత బాధ్యతలు ఎక్కువవుతాయనే ఆలోచనతో ప్రస్తుతానికి కొత్త సినిమాలను ఒప్పుకోవడం లేదట. కమిటైన సినిమాలను పూర్తి చేయడం..మ్యారేజ్ లైఫ్ ఎజాయ్ చేయడంలో బిజీగా ఉంది రష్మిక మందన్న.
మరి..ఈ బ్యూటీ కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటుందా..లేకపోతే ఒప్పుకున్నవి పూర్తి చేసి కొంతకాలం బ్రేక్ తీసుకుంటుందా చూడాలి. ఇక, పుష్ప ఫ్రాంఛైజీస్ లో మూడవ భాగం కూడా ఉంది. ఇందులో రష్మిక మందన్న పాత్ర ఉంటుందని గత భాగంలోనే హింట్ ఇచ్చాడు సుకుమార్. కానీ, ఇప్పుడు రష్మిక పరిస్థితి చూస్తే పుష్ప 3 చేసేలా కనిపించడం లేదు.












