Bhagyashri Borse: సినిమా ఇండస్ట్రీలలో హీరోయిన్స్ మధ్య పోటీ ఉండటం సహజమే. అయితే, ఓ సినిమాను వదులుకున్న తర్వాత అదే సినిమాను ఒప్పుకున్న హీరోయిన్ కి గనక హిట్ దక్కితే అప్పుడు సోషల్ మీడియాలో గానీ..ఫిల్మ్ సర్కిల్స్‌లో గానీ జరిగే చర్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి చర్చే ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే, శ్రీలీల గురించి జరుగుతోంది.
అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. పలు వాయిదాల పర్వం తర్వాత ఎట్టకేలకి...జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అనే టాక్ తెచ్చుకుంది. 10, 11వ తేదీలలో కలెక్షన్స్ బాగా వచ్చాయి. అఖిల్ కెరీర్‌లో కమర్షియల్ హిట్ మాత్రమే కాకుండా, మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే, ఈ సినిమా ఘన విజయం మాత్రం డాన్సింగ్ క్వీన్ శ్రీలీల మిస్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు.

వాస్తవానికి, లెనిన్ సినిమాలో ముందు తీసుకున్న హీరోయిన్ శ్రీలీల. భారతి పాత్రకి సరిగ్గా సరిపోయింది. అఖిల్-శ్రీలీల పోస్టర్ కూడా ఎంతో ఆకట్టుకుంది. కానీ, సడన్‌గా ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుంది. తన స్థానంలో భాగ్యశ్రీ బోర్సే వచ్చి చేరింది. కెరీర్ ప్రారంభం నుంచి అటు అఖిల్ కి ఇటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి సాలీడ్ హిట్ దక్కలేదు.
దాంతో, లెనిన్ సినిమా మీద అంతగా ఎవరికీ నమ్మకాలు లేవు. కానీ, కథ..కథనం ఆసక్తిగా ఉండటం..వీరిద్దరి పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్‌గా కుదరడంతో బాక్సాఫీస్ వద్ద మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. దాంతో, ఇప్పుడు అందరూ శ్రీలీల అనవసరంగా మంచి హిట్ ని పోగొట్టుకుందని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకూ శ్రీలీల కెరీర్ లో హిట్స్ అంటే ఒక్క ధమాకా మాత్రమే. మిగతావన్నీ ఫ్లాప్‌గా మిగిలాయి. ఇప్పుడు, గనక లెనిన్ చేసి ఉంటే శ్రీలీల ఖాతాలో సాలీడ్ హిట్ పడి ఉండేది. ఇకపై, క్రేజీ ప్రాజెక్ట్స్ కి ఆప్షన్ భాగ్యశ్రీ అనే అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో శ్రీలీలకి.. భాగ్యశ్రీ గట్టి పోటీ కానుందని అర్థమవుతోంది.












