తెలంగాణ

TG : గ్రామానికి కీడు సోకిందని.. ప్రజల వింత నిర్ణయం

రచన: Kumar3 నిమిషాల పఠనం

పల్లెల్లో కొన్ని వింత ఆచారాలు ఉంటాయి.వాస్తవానికి అవన్నీ పూర్వీకుల నుంచి ఫాలో అవుతూ వస్తుంటారు కొందరు జనాలు. ఊరిలో ఏదైనా వరుసగా మరణాలు సంభవించడం, వింత వ్యాధులు పుట్టుకు రావడం వంటివి జరగడం, అపశకునాలు జరిగాయంటే చాలు. ప్రజల్లో ఒక భయం వెంటాడుతుంటుంది.

పల్లెల్లో కొన్ని వింత ఆచారాలు ఉంటాయి.వాస్తవానికి అవన్నీ పూర్వీకుల నుంచి ఫాలో అవుతూ వస్తుంటారు కొందరు జనాలు. ఊరిలో ఏదైనా వరుసగా మరణాలు సంభవించడం, వింత వ్యాధులు పుట్టుకు రావడం వంటివి జరగడం, అపశకునాలు జరిగాయంటే చాలు. ప్రజల్లో ఒక భయం వెంటాడుతుంటుంది. శుభకార్యాలు జరగకపోయినా అనుమానం వారిని వెంబడిస్తుంటుంది. చిన్నపిల్లలు, పెద్దలకు వరుసగా జ్వరాలు, మంచం పడుతున్నా ఊరికి ఏదో గాలి సోకిందని పుకారు పుడుతుంది. అది కాస్త పెను భూతంలా మారి ఊరినే కబలించాలని చూస్తుంది.

అలాంటి ఘటనే రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలోని ఓ గ్రామానికి కీడు సోకిందని ఊరి పెద్దల వింత నిర్ణయం మేరకు ప్రజలు దానిని పాటిస్తున్నారు. ఇంతకీ ఏమైంది? ఊరిపెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నారు. దానిని ప్రజలు ఎలా పాటించారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

జమ్మికుంట నగరంలోని 13, 14వ వార్డు ఆబాది జమ్మికుంటలో ఊరికి కీడు సోకిందని ప్రజలు నమ్మసాగారు. దీంతో సాంప్రదాయబద్ధంగా "గ్రామం ఖాళీ" చేశారు. అయితే, గత కొంత కాలంగా గ్రామంలో పలువురు మరణించడంతో ఊరికి కీడు సోకిందని గ్రామపెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. పెద్ద మనుషుల సమక్షంలో సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నారు.

ఆ మేరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ ప్రజలందరూ ఊరు వదిలిపెట్టి గ్రామ శివారులో బయట వంటలు చేసుకోవాలని తీర్మానించారు.గ్రామీణ ప్రాంతాల్లో అపశకునాలు, గాలి, కీడు సోకిందని భావించినప్పుడు ఇలా ఊరు బయట వంటలు చేసుకుని, ప్రత్యేక పూజలు చేయడం పాతకాలం నాటి ఆచారం. "ఊరు శుద్ధి" పేరిట ఇలా చేస్తుంటారు. ఇలా చేస్తే కీడు తొలగిపోతుందని స్థానికుల నమ్మకం. గతంలో కూడా చాలా సార్లు బయటకు వంటల కోసం వెళ్ళామని గ్రామస్తులు చెబుతున్నారు.

#jammikunta#village vacate#cooking#outside#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి