సినిమా

Raviteja-Irumudi: అవుట్ పుట్ బావుండాలంటే దర్శకుడు అవి యాడ్ చేయాలా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Raviteja-Irumudi: రవితేజ..అంటే ఆయన సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైనర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంత మాస్ సినిమా అయినా కుటుంబం అంతా కలిసి చూసేలా రవితేజ కథలుంటాయి. క్రాక్, ధమాకా సినిమాల తర్వాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ రవి ఖాతాలో పడలేదు. మెగాస్టార్ చిరంజీవితో చేసిన వాల్తేరు వీరయ్య సక్సెస్ ఇద్దరి ఖాతాలోకి చేరింది. మళ్ళీ సోలో హిట్ దక్కాలంటే రవితేజ ఇరుముడి మూవీతోనే సాధ్యం.

కుటుంబ కథా చిత్రాలను అద్భుతంగా తీయగల దర్శకుడు కిషోర్ తిరుమల. ఆయన దర్శకత్వంలో రవితేజ నటించిన భర్త మహాశయులకువిజ్ఞప్తి ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నప్పటికీ, అలాంటి కథలను ఎన్నోసార్లు చూసి ఉండటంతో ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే వెంకటేష్ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, చిరంజీవి నటించిన బావగారు బావున్నారా లాంటి సినిమాలను గుర్తు చేసుకున్నారు.

అయినా, ఎక్కడో కథ కాస్త కొత్తగా ఉంటుందని ఆశించి థియేటర్స్‌కి వెళ్ళారు. కానీ, నిరాశ తప్పలేదు. దాంతో, నెక్స్ట్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు రవితేజ. ఇప్పుడు కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీనే చేస్తున్నాడు. మజిలీ, టక్ జగదీష్, ఖుషి సినిమాలతో దర్శకుడిగా సత్తా చాటిన శివ నిర్వాణ, ఇరుముడి పేరుతో సినిమాను రవితేజతో రూపొందిస్తున్నాడు. హీరోయిన్‌గా ప్రియ భవానీ శంకర్ నటిస్తోంది. ఆగస్టులో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే, ఇప్పటికే..ఫస్ట్ కాపీ చూశారట. ఇంట్రవెల్ ముందు వచ్చే కొన్ని సీన్స్ హైలెట్ గా ఉన్నప్పటికీ..ఇంకా కొన్ని షాట్స్ రవితేజపై ఉంటే అవుట్ పుట్ ఇంకా ఎఫెక్టివ్‌గా వస్తుందని చిత్రబృందం భావించిందట. అందుకే, దర్శక-నిర్మాతలు మరికొన్ని షాట్స్ ని రవిపై చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ సినిమాను భక్తి, కుటుంబం, కామెడీ ఎంటర్‌టైనర్‌గా శివ నిర్వాణ తయారు చేస్తున్నాడు. అన్నట్టు, వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ, ఇరుముడి సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోలేదట.హిట్ అయితే, లాభాలలో వచ్చినంత వరకూ వాటా తీసుకోవాలని..లేదంటే జీరో రెమ్యునరేషన్ దగ్గర ఆగిపోవాలని భావిస్తున్నాడట.

#raviteja#irumudi#ShivaNirvana#priyabhavanishankar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి