క్రీడలు

ICC : దెబ్బ మీద దెబ్బ.. నంబర్ 1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా!

రచన: Kumar4 నిమిషాల పఠనం

టీమిండియాకు మరో బిగ్‌షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ ప్రదర్శన చాలా చెత్తగా ఉందని సీనియర్లు విమర్శలు చేస్తున్నారు. కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా గెలవలేకపోయారని.. సిరీస్ సమర్పించుకుంటే సమర్పించుకున్నారు కానీ, వైట్‌‌వాష్ అవ్వడం ఏంటని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీమిండియాకు మరో బిగ్‌షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ ప్రదర్శన చాలా చెత్తగా ఉందని సీనియర్లు విమర్శలు చేస్తున్నారు. కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా గెలవలేకపోయారని.. సిరీస్ సమర్పించుకుంటే సమర్పించుకున్నారు కానీ, వైట్‌‌వాష్ అవ్వడం ఏంటని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ బాధ నుంచి కుర్రాళ్లు ఇంకా తేరుకోకముందే ఐసీసీ మరో షాక్ ఇచ్చింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని టీమిండియా కోల్పోయింది.

1605 రోజుల తర్వాత టీ20ల్లో మొదటి స్థానాన్ని భారత్ కోల్పోయింది. ఇండియాపై తాజాగా టీ20 సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ రెండో స్థానం నుంచి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఒక టీ20 సిరీస్ లేదా టోర్నమెంట్‌లో ఇండియా మూడు కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఓడిపోవడం కూడా ఇదే తొలిసారి. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ క్యాచ్ అఫీషియెన్సీ 85.2%గా ఉండగా..ఇండియాది కేవలం 72% మాత్రమే. ఇండియా తర్వాత ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఆస్ట్రేలియా, నాలుగో స్థానంలో న్యూజిలాండ్, ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా ఉన్నాయి.

శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి మ్యాచులోనూ ఇండియా ఓటమిపాలైంది. దీంతో 5-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ అయ్యింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇప్పటికే ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన భారత్, ఇంగ్లాండ్ చేతిలోనూ అదే పరిస్థితిని కొనసాగించింది. ఐదవ టీ20లో కూడా ఇంగ్లాండ్ చేతిలో భారత్ 56 పరుగుల తేడాతో దారుణమైన ఓటమి చవిచూసింది.

ఇదిలాఉంటే, ఇంగ్లాండ్, ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓటమికి కోచ్ గౌతమ్ గంభీర్ కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అతని కోచ్ పదవిపై సమీక్ష ఉంటుందని బీసీసీఐ ఇటీవల ఓ ప్రకటన చేసింది. త్వరలోనే దీనిపై వివరణ కోరాక నిర్ణయం ఉంటుందని సమాచారం. ఐపీఎల్‌లో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ స్వదేశీ గడ్డమీదే రెచ్చిపోతాడని, విదేశీ గడ్డపై ఆడలేడని కూడా విమర్శలు వస్తున్నాయి.

#India cricket team#losses#Icc#T20's number one rank#sports
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి