సినిమా

Lenin: ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తేనే అఖిల్‌కు హిట్ ప‌డిందా..?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Lenin: కింగ్ నాగార్జున వారసుడిగా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేనికి, టాలెంట్ ఉన్నప్పటికీ సరైన కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. హీరోగా పదేళ్ల ప్రయాణం పూర్తయినా ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ కోసం అక్కినేని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు ఎట్టకేలకు తెరదించుతూ, జులై 10న విడుదలైన ‘లెనిన్’ చిత్రంతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాడు.

Lenin: కింగ్ నాగార్జున వారసుడిగా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేనికి, టాలెంట్ ఉన్నప్పటికీ సరైన కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. హీరోగా పదేళ్ల ప్రయాణం పూర్తయినా ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ కోసం అక్కినేని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు ఎట్టకేలకు తెరదించుతూ, జులై 10న విడుదలైన ‘లెనిన్’ చిత్రంతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాడు. థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే, అయ్యగారు ఎట్టకేలకు ఒక క్లీన్ హిట్ ఖాతాలో వేసుకున్నారని అర్థమవుతోంది.

అయితే, ఈ సక్సెస్ వెనుక ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన గాసిప్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే.. అఖిల్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ విలేజ్ లవ్ స్టోరీ నిజానికి ఆయన కోసం రాసింది కాదట. ఈ కథ మొదట అక్కినేని కాంపౌండ్‌కు కాకుండా, టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని దగ్గరకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ‘దసరా’ వంటి మాస్ హిట్ తర్వాత నాని ఇమేజ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడంతో, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ సబ్జెక్ట్‌కు నాని అయితేనే పర్ఫెక్ట్ జస్టిస్ చేయగలడని భావించారట.

కథ విన్నప్పుడు నానికి కూడా స్క్రిప్ట్ బాగా నచ్చిందని సమాచారం. కానీ, అప్పటికే ఆయన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ప్యారడైజ్’ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ సినిమాకు భారీగా డేట్స్ కేటాయించాల్సి రావడంతో, కాల్‌షీట్స్ సర్దడం కుదరక నాని ఈ ప్రాజెక్ట్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు ఇండస్ట్రీ టాక్. ఒకవేళ నానికి డేట్స్ ఉండి ఉంటే, ‘లెనిన్’ రూపంలో ఆయన ఖాతాలో మరో హిట్ పడేదనేది కొందరి విశ్లేషణ.

కాగా, నాని నో చెప్పిన తర్వాతే ఈ కథ అఖిల్ చేతికి వచ్చింది. వైవిధ్యమైన కథ కోసం వెతుకుతున్న అఖిల్‌కు ఈ విలేజ్ డ్రామా బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు థియేటర్లలో అఖిల్ నటనకు వస్తున్న ప్రశంసలు చూస్తుంటే, ఈ పాత్ర ఆయన కోసమే పుట్టిందా అన్నట్లుగా ఉందంటున్నారు అభిమానులు. ఒక రకంగా నాని ఆ సినిమాను వదులుకోవడం వల్లే, అఖిల్‌కు ఈ రేంజ్ సక్సెస్ దక్కిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఒకరి రిజెక్షన్.. మరొకరి సెలబ్రేషన్ అంటే ఇదేనేమో.

#lenin#nani#akhil#bhagyasri borse
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి