ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళలు,చిన్నారులు, యువతుల పట్ల కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.పార్సిల్ డెలివరీలు, బిల్స్, నెట్ కనెక్షన్‌ల కోసం వస్తున్న కొందరు బాయ్స్.. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించి మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో చాలా వైరల్ అవుతున్నాయి. అసభ్యంగా సైగలు చేయడం, సెక్సువల్‌గా వేధించడం,బూతులు తిట్టడం వంటివి చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ఓ డెలివరీ బాయ్ ఒంటరిగా ఉన్న యువతి ఇంటికి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఓ పార్సిల్ ఇచ్చేందుకు వచ్చిన డెలివరీ బాయ్ అర్జెంట్‌గా వాష్‌రూమ్ వెళ్లాలని రిక్వెస్ట్ చేశాడు. ఆమె వద్దని వారిస్తున్నా వినిపించుకోలేదు. బలవంతంగా యువతి ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడితో ఆగకుండా యువతికి ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు.
డెలివరీ బాయ్ చేష్టలతో భయాందోళనకు గురైన యువతి.. అతడు చేస్తున్న పనులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యవతి ప్రశ్నిస్తూ వీడియో తీస్తున్న సమయంలో అతడు ఇంట్లో నుంచి పారిపోతున్నట్టు కనిపిస్తోంది. ‘నా గురించి ఏం అనుకుంటున్నావ్.. పోలీసులకు ఫోన్ చేస్తా ఆగు’ అంటూ యువతి గట్టిగా కేకలు వేసినట్టు సదరు వీడియోలో కనిపిస్తోంది.
అతడిని ఎలాగైనా వదిలిపెట్టనని కచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధిత యువతి వెల్లడించింది. ఇలాంటి వాళ్లను పనిలో పెట్టుకునేముందు కంపెనీలు బ్యా గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు అతడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.కంపెనీ సైతం అతన్ని తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
https://www.instagram.com/reel/DaqOM_bP3b3/?utm_source=ig_web_button_share_sheet












