రాజకీయాలు

Congress : 9 మంది పదవులను ఎవరూ కదిలేంచలేరు : మందుల సామేల్

రచన: Kumar4 నిమిషాల పఠనం

కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ఇంకా తగ్గలేదు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య పదవుల పంచాయితీలు నడుస్తున్నాయి. ఇటీవల నూతన మండల అధ్యక్షుల నియామకం వీరి మధ్య కొత్త పంచాయితీకి తెరలేపిందని సమాచారం.

కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ఇంకా తగ్గలేదు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య పదవుల పంచాయితీలు నడుస్తున్నాయి. ఇటీవల నూతన మండల అధ్యక్షుల నియామకం వీరి మధ్య కొత్త పంచాయితీకి తెరలేపిందని సమాచారం.తమ వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎంపీ చామల ఆరోపిస్తున్నట్టు సమాచారం.కాగా, తుంగతుర్తి విషయంలో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యే సామేల్ సీరియస్‌గా బదులిచ్చినట్టు తెలుస్తోంది.

తుంగతుర్తి కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు నేటి మధ్యాహ్నం మందుల సామేల్ పీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎదుట హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎమ్మెల్యేగా తన హక్కులు కాలరాస్తే తిరగబడతానని’ హెచ్చరించారు. బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన వారికి పదవులు ఇవ్వలేదని అన్నారు.కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లకు ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కష్టపడ్డవాళ్లకే టికెట్లు ఇచ్చామని వెల్లడించారు.

9 మంది నేతల పదవులను ఎవరూ కదిలించలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ చామల లేఖ రాయడం వల్లనే ఈ పంచాయితీ మొదలైందని వివరించారు. ఎంపీ చామలతో తనకు ఎలాంటి గొడవలు లేవని, ఇద్దరం ఫ్రెండ్లీగా ఉంటామన్నారు. చామలకు అసలు తుంగతుర్తి గురించి తెలియదని, ఎన్నికల సమయంలో సపోర్ట్ చేయడంతో ఆయన ఎంపీ అవ్వాలని తానూ కోరుకున్నట్టు తెలిపారు. కొంతమంది మాటలు విని ఎంపీ చామల ఇలా చేస్తున్నారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

తుంగతుర్తి తమ సంస్థానంలో భాగం అని కొందరు అనుకుంటున్నారని, అలా అనుకుంటే కష్టం అని చెప్పారు. జగ్గారెడ్డితో మాట్లాడిన తరవాత అవసరమైతే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలను సైతం కలుస్తానని తెలిపారు. ఇదిలాఉంటే మండల కమిటీల ఎన్నికల విషయంలో తుంగతుర్తి కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేల్ వర్గాల మధ్య విభేదాలు తలెత్తగా.. ఆ సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పగించింది.

#mp chamala kiran kumar reddy#mla mandula samel#tungaturthi#congress#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి