2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్ చాలా వేగంగా సాగుతున్నాయి.ఈ విషయాన్ని ఐటీ శాఖ వెల్లడించింది. గతంతో పోలిస్తే చాలా మందికి ఐటీఆర్ ఫైలింగ్ మీద అవగాహన రావడం, దేశంలో ఐటీ మినహాయింపు శ్లాబ్ మారినా.. ఆదాయం పెరిగిన వారు సైతం చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలోనే టాక్స్ కట్ అయిన వారు రిటర్న్స్ కోసం ఫైలింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఐటీఆర్ ఫైలింగ్ మీద సోషల్ మీడియాతో పాటే ప్రభుత్వం సైతం ప్రకటనలు, అవగాహన కల్పించడం వల్లే ఇది సాధ్యమైనట్టు నిపుణులు పేర్కొంటున్నారు.
రూ.1.7 కోట్లకు పైగా రిటర్న్స్ ఫైల్..
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫైలింగ్ అత్యంగ వేగంగా జరుగుతోందని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పటివరకు 1.7 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లు దాఖలు చేసినట్లు ఇన్‌టాక్స్ డిపార్ట్మెంట్ శనివారం ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం ఒక్క రోజే 10 లక్షలకు పైగా ఐటీఆర్‌లు దాఖలైనట్టు తెలిపింది.
వేతనం, ఇంటి ఆస్తి, ఏడాదికి రూ.5,000 వరకు వ్యవసాయ ఆదాయం కలిపి వార్షిక ఆదాయం రూ.50 లక్షల వరకు ఉన్న వ్యక్తులు ఐటీఆర్-1 ఫారం ద్వారా రిటర్న్ దాఖలు చేయవచ్చని ఐటీశాఖ తెలిపింది. ఇక వ్యాపార ఆదాయం లేకపోయినా, మూలధన లాభాలు ఉన్న వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) ఐటీఆర్-2 ఫారాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.
ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలుకు జూలై 31 చివరి తేదీ కావడంతో, చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే రిటర్న్ ఫైల్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది. అలా చేయడం వలన రిటర్ట్న్ పొందే చాన్స్ ఉంటుందని లేదంటే తిరిగిపొందలేరని తెలిపింది.












