సినిమా

S. Janaki: మొత్తం ఆస్తుల విలువెంతో తెలుసా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

S. Janaki: భారతీయ సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో దశాబ్దాల పాటు శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన గానకోకిల ఎస్. జానకి (88) ఇకలేరనే వార్త సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, మైసూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

S. Janaki: భారతీయ సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో దశాబ్దాల పాటు శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన గానకోకిల ఎస్. జానకి (88) ఇకలేరనే వార్త సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, మైసూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి అగ్ర నటులు, రాజ‌కీయ నాయ‌కులు జానకమ్మ మృతికి సంతాపం ప్రకటిస్తూ, భారతీయ సంగీతానికి ఇది తీరని లోటని కొనియాడారు.

అయితే దాదాపు 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి, 4 జాతీయ అవార్డులతో పాటు ఎన్నో నంది పురస్కారాలను అందుకున్న జానకమ్మ.. తన సుదీర్ఘ కెరీర్ లో సంపాదన పరంగానూ సరికొత్త రికార్డులు సృష్టించారు. ఆ కాలంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే మహిళా సింగర్ గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోల సినిమాలకు పాట పాడాలంటే అప్పట్లోనే ఆమె లక్షల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేసేవారని టాక్. గత పదేళ్లుగా ఆమె మైక్ పట్టుకోకపోయినా, అంతకుముందు సంపాదించిన సొమ్మును అత్యంత చాకచక్యంగా ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియా మరియు పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఎస్. జానకి ఆస్తుల విలువ దాదాపు రూ. 537 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె తన సంపాదనను కేవలం బ్యాంకుల్లో దాచుకోకుండా, ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెట్టారట‌. ముఖ్యంగా చెన్నై మహానగరంలోని ప్రైమ్ లొకేషన్లలో ఆమెకు భారీగా స్థిరాస్తులు, విలాసవంతమైన భవనాలు ఉన్నట్లు సమాచారం. ఒక సాధారణ గాయనిగా ప్రస్థానం మొదలుపెట్టి, తన ప్రతిభతో ఇంతటి సామ్రాజ్యాన్ని నిర్మించిన జానకమ్మ భౌతికంగా దూరమైనా.. ఆమె పాడిన పాటలు, ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ అమరమే.

లెజండరీ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యంతో జానకమ్మ పాడిన ఎన్నో డ్యూయెట్స్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అంతేకాదు, ఇప్పటికీ ఆ పాటలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఉన్నారు.విశేషం ఏమిటంటే జానకమ్మ ఏ వయసు వారికైనా పాట పాడగలదు. అంతేకాదు, ఇప్పటి జనరేషన్ యూత్ కూడా జానకమ్మ పాటలకి పెద్ద అభిమానులే.

#s.janaki#indian female singer s janaki#playbacksingersjanaki#cinemanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి