Sujeeth: ఒక సినిమా సెట్స్‌పైకి రావాలంటే ఎన్నో లెక్కలుంటాయి. ఏ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో, ఏ సినిమా ఎప్పుడు ఆగిపోతుందో..ఏ కథ ఎవరికి నచ్చుతుందో..ఒక హీరో నచ్చిన కథ మరో దగ్గరికి ఎందుకు వెళుతుందో.. ఎవరూ చెప్పలేరు. కొన్ని సందర్భాలలో సెట్స్ పైకి రావాల్సిన కాంబినేషన్ సినిమా ఆగిపోయి..మరో కాంబినేషన్ సినిమా పట్టాలెక్కుతుంది.
అలా, పట్టాలెక్కబోతున్న సినిమానే ఓజీ 2. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో వచ్చి..ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయల వసూళ్ళు రాబట్టి సెన్షేషన్ క్రియేట్ చేసిన ఓజీ సినిమాకి సీక్వెల్‌గా రాబోతోంది. వాస్తవానికి, ఓజీ 2 ఇప్పట్లో ఉండదని అందరూ అనుకున్నారు. దీనికి, కారణం పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో పాటు, సురేందర్ రెడ్డి సినిమాను పట్టాలెక్కించాలనుకోవడమే.
కానీ, ఇంకా సూరి సినిమా స్క్రిప్ట్ దశలోనే ఉంది. పవన్ కళ్యాణ్-సురేందర్ రెడ్డి సినిమా సెట్స్‌పైకి రావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈ లోపు సుజీత్ ఓజీ కథను బాపు-రమణ ల మాదిరిగా పిక్స్ తో సహా నరేట్ చేసి పవన్ కళ్యాణ్‌ని ఇంప్రెస్ చేశాడు. దాంతో, పవన్ ముందు ఓజీ 2 చేయడానికి ఆసక్తి చూపించాడు. అంతే, సుజీత్ పూర్తిగా ఓజీ 2పై ఫోకస్ పెట్టాడు. ఈ నేపథ్యంలో నాని సినిమాను పక్కన పెట్టాల్సి వచ్చింది.
ఆ సినిమానే బడ్లీ రోమియో. వాస్తవానికి నాని-సుజీత్ ల సినిమా మొదలవ్వాల్సింది. కానీ, శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న ది ప్యారడైజ్ మేకింగ్ బాగా ఆలస్యం అవుతోంది. అందుకే, నానీ-సుజీత్ కాంబో సెట్స్ మీదకి రావాలంటే ఇంకా సమయం పడుతోంది. అందుకే, సుజీత్..ఓజీ 2ని లైన్‌లో పెట్టాడు. దీన్ని బట్టి చూస్తే, బ్లడీ రోమియో సినిమా ఈ ఏడాది స్టార్ట్ అవడం చాలా కష్టం. ఇంకా, చెప్పాలంటే 2027 లో కూడా డౌటే అంటున్నారు. ఇక, నాని ఒకవైపు హీరోగా చేస్తూనే..మెగాస్టార్ చిరంజీవితో తన సొంత బ్యానర్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమాను నిర్మించనున్నాడు. దీనికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్నాడు.












