వైరల్ న్యూస్

Technology: 12 ఏళ్ల బాలిక చేసిన పనికి ప్రపంచమే నివ్వెర పోయింది!..

రచన: Venu4 నిమిషాల పఠనం

మనిషి జీవితంలో ఏదైన సమస్య వస్తే కొందరు ధైర్యంగా ఎదుర్కొంటారు. మరికొందరు అయితే సమస్య చిన్నదా.. పెద్దదా.. అనేది పట్టించుకోరు..దాని పరిష్కారం పైనే దృష్టి పెడతారు. సమస్యకు ముగింపు పలికే వరకు విశ్రమించరు.

మనిషి జీవితంలో ఏదైన సమస్య వస్తే కొందరు ధైర్యంగా ఎదుర్కొంటారు. మరికొందరు పిరికి వారుగా మారి ఆ ప్రాబ్లం ను ఎదుర్కొనలేక తప్పుడు మార్గాలు ఎంచుకోవడం గాని, లేదా దాని నుండి తప్పించుకోవడానికి పారి పోవడం వంటివి చేస్తారు ..

మరికొందరు అయితే సమస్య చిన్నదా.. పెద్దదా.. అనేది పట్టించుకోరు..దాని పరిష్కారం పైనే దృష్టి పెడతారు. సమస్యకు ముగింపు పలికే వరకు విశ్రమించరు. అలాంటి వ్యక్తే బ్రిటీష్ కొలంబియాకు చెందిన మానా జంపాల. ఈమె భారతీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, కెనడాలో పుట్టి పెరిగింది.

కాగా 12 ఏళ్ల వయసున్న ఈ బాలిక తాము నిర్వహిస్తున్న వ్యాపారంలో తక్కువ మంది సిబ్బంది ఉండటంవల్ల కస్టమర్ల నుంచి వచ్చే కాల్స్ స్వీకరణ, నిర్వహణలో తన తండ్రి ఇబ్బంది పడుతున్నట్లు గమనించింది. అంతటితో గమ్మున ఉండలేదు.. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని నిశ్చయించుకుంది.

ఈ క్రమంలో తనే స్వయంగా ఒక ఏఐ ఆధారిత రిసెప్షనిస్ట్ వోగ్జా ను 2025 నవంబర్‌లో డెవలప్ చేసింది. ఈ చిన్న సాఫ్ట్‌వేరే ఇప్పుడు తన కుటుంబం నిర్వహించే చిన్న వ్యాపారాల్లో 24/7 కస్టమర్ కాల్స్ మేనేజ్ చేయడంలో సహాయపడుతుంది. మరో వైపు మానా జంపాల కుటుంబం బ్రిటిష్ కొలంబియాలోని కెలోనా నగరంలో స్థిరపడింది.

అయితే ఈ బాలిక అందరిలా తన వయస్సు వారితో ఎంజాయి చేయలేదు. తొమ్మిదేళ్ల వయసు నుంచే ఏఐ(AI)పై ఆసక్తితో స్క్రాచ్ కోడింగ్ క్యాంపుల్లో పాల్గొనేది, పైథాన్ కూడా నేర్చుకుంది. అలాగని చదువును మధ్యలో ఆపలేదు.. ప్రస్తుతం చదువుకుంటూనే కోడింగ్, సైన్స్ పోటీలపై దృష్టి సారించింది.

ఇక మానా జంపాల డెవలప్ చేసిన వోగ్జా (Voxa) అనే ఏఐ రిసెప్షనిస్ట్.. అపాయింట్‌మెంట్లు బుక్ చేయడం, కస్టమర్ల కాల్స్‌కు సమాధానం ఇవ్వడం, మిస్డ్ కాల్స్ నిర్వహణ, కాల్ సమరీలు ఇవ్వడం, రెస్టారెంట్ ఆర్డర్లు నమోదు చేయడం వంటి పనులు చేసిపెడుతోంది.

అయితే ఈ వోగ్జా ఇంకా ‘బూట్‌స్ట్రాప్ దశ’లోనే ఉందట. ఇదంతా పక్కనపెడితే పన్నెండేళ్ల వయసులోనే ఒక కోడింగ్ ఆధారిత ప్రాజెక్ట్‌లో సక్సెస్ కావడం, ఏఐ ఆధారిత వోగ్జా రిసెప్షనిస్టును డెవలప్ చేయడం వంటి వాటిలో ఆమెకు ఉన్న ప్రతిభను చూసి ముగ్ధులవని వారు లేరట.

మరోవైపు నేడు ఎంతో ప్రతిభ ఉన్నా యువతి యువకులు ప్రేమ, దోమ అంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. లేదంటే లైఫ్ ఉన్నదే ఎంజాయి చేయడానికే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఆధునిక యువతకు మానా జంపాల ఒక ప్రేరణ అనడంలో సందేహం లేదు..

#world#Colombia#Mana Jampala#Kelowna#Scratch#Voxa#AI#12-year-old girl
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి