వైరల్ న్యూస్

సామాన్యుడిలా బస్సెక్కిన మంత్రి.. చిల్లర లేదని దించేసిన కండక్టర్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ప్రజా రవాణా వ్యవస్థలో సామాన్య ప్రయాణికులు నిత్యం ఎదుర్కొంటున్న కష్టాలు అంతా ఇంతా కాదు. బస్సు ఎక్కినా, ఆటో ఎక్కినా చిల్లర సమస్యతో పాటు అదనపు ఛార్జీలతో సామాన్యులు సతమతమవుతున్నారు.

 ప్రజా రవాణా వ్యవస్థలో సామాన్య ప్రయాణికులు నిత్యం ఎదుర్కొంటున్న కష్టాలు అంతా ఇంతా కాదు. బస్సు ఎక్కినా, ఆటో ఎక్కినా చిల్లర సమస్యతో పాటు అదనపు ఛార్జీలతో సామాన్యులు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలనుకున్న రాష్ట్ర మంత్రికి విచిత్ర అనుభవం ఎదురైంది. నగరంలో మారువేషంలో తనిఖీలకు వెళ్లిన ఆయనకు.. చిల్లర సమస్య కారణంగా ఒక బస్సు కండక్టర్ ఏకంగా ఆ మంత్రిని బస్సులోంచి దించేశాడు.

 వివరాల్లోకి వెళ్తే.. రవాణా వ్యవస్థ తీరుతెన్నులను స్వయంగా అంచనా వేయడానికి కర్ణాటక రవాణా శాఖ మంత్రి భైరతి సురేశ్‌ ఒక వినూత్న ప్లాన్ వేశారు. ముఖానికి మాస్క్ ధరించి, ఎవరికీ గుర్తుపట్టకుండా ఒక సాధారణ పౌరుడిలా హెబ్బాల్‌ నుంచి నాగశెట్టిహళ్లి వెళ్లే బీఎంటీసీ బస్సు ఎక్కారు. కండక్టర్ దగ్గర రెండు టికెట్లు తీసుకుని, చేతిలో రూ.100 నోటు పెట్టారు.

 అయితే, తనకు సరిపడా చిల్లర ఇవ్వాలని కండక్టర్ అడగ్గా.. తన వద్ద లేదని మంత్రి చెప్పారు. దాంతో ఆగ్రహించిన కండక్టర్, "నా దగ్గర కూడా చిల్లర లేదు.. కరెక్ట్ డబ్బులు ఇవ్వకపోతే బస్సు దిగిపోండి" అంటూ నిష్కర్షగా సమాధానమిచ్చారు. మంత్రి మాస్క్ వేసుకోవడం వల్ల ఆయనెవరో కండక్టర్ గుర్తించలేకపోయారు. దీనికి మంత్రి కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా, మౌనంగా బస్సు దిగి కాలినడకన ముందుకు సాగారు.

 బస్సు దిగిన తర్వాత నాగశెట్టిహళ్లి వైపు వెళ్లేందుకు మంత్రి భైరతి సురేశ్ ఒక ఆటోను ఆశ్రయించారు. ప్రయాణం ముగిశాక మీటర్‌లో రూ.30 ఛార్జి చూపించగా, సదరు డ్రైవర్ మాత్రం రూ.36 డిమాండ్ చేశాడు. ఎందుకని మంత్రి ప్రశ్నించగా.. "మీటర్ ఇంకా అప్‌డేట్ కాలేదు, త్వరలోనే రిపేర్ చేయిస్తా" అంటూ డ్రైవర్ కవర్ చేశాడు. చివరకు మంత్రి అడిగినంత రూ. 40 ఇచ్చి అక్కడి నుంచి వెనుతిరిగారు. ఈ ఆకస్మిక తనిఖీ ద్వారా బస్సుల్లో చిల్లర కష్టాలు, ఆటో డ్రైవర్ల అదనపు వసూళ్ల వంటి నిత్య జీవిత సమస్యలను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నట్లు మంత్రి ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
https://x.com/byrathi_suresh/status/2076137435646578825?s=20

#KarnatakaTransportMinister#BMTCBusConductor#BengaluruPublicTransport#SurpriseInspection#ChillaraProblems#AutoFareRipOff
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి