సినిమా

వీడియో.. టాలీవుడ్ లో రగడ.. శేఖర్-జానీ మాస్టర్స్ మధ్య వివాదం!..

రచన: Venu2 నిమిషాల పఠనం

టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్‌ ఎన్నికల్లో వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో విభేదాలు వచ్చినట్లు తెలుస్తుంది.

టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్‌ ఎన్నికల్లో వివాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణతో ఒక్కసారిగా ఇక్కడి వాతావరణం వేడెక్కింది. అసోసియేషన్‌ ఎన్నికల్లో భాగంగా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూప్స్‌ మధ్య వివాదం మొదలైనట్టు సమాచారం..

ఇరు వర్గాల మధ్య అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో విభేదాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో అసోషియేషన్ ఛాంబర్ వద్ద ఉద్రిక్తత నెలకొందని తెలుస్తుంది.

అయితే ఈ వివాదంలో జానీ మాస్టర్ భార్య పేరు తెరపైకొచ్చింది. కొందరు డ్యాన్సర్లు అసోసియేషన్‌ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ భార్య సుమలతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ప్రతి విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఆమె తీరు నచ్చక ఇప్పటికే అసోసియేషన్‌కు చెందిన 10 మంది డ్యాన్సర్లు రాజీనామా చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో సుమలత ఫెడరేషన్‌ అనుమతి లేకుండా బై ఎలక్షన్‌కు సిద్ధం కావడం వివాదానికి దారితీసినట్టు తెలుస్తుంది.

#Tollywood#movies#telugu film#dance-association#controversey#Sekhar#Jani Master
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి