వైరల్ న్యూస్

వీడియో వైరల్: పిల్లకు శాపంగా మారిన పెద్దల నిర్లక్ష్యం!..

రచన: Venu4 నిమిషాల పఠనం

తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనం నిలిపిన వెంటనే ఇంజిన్ ఆఫ్ చేసి, కీని తప్పనిసరిగా తీసేయాలి. అలాగే ఇంజిన్ ఆన్‌లో ఉన్న ద్విచక్ర వాహనంపై పిల్లలను ఒంటరిగా వదిలేయడం చాలా ప్రమాదం..

ఒక్క క్షణం నిర్లక్ష్యం... జీవితాంతం మరిచిపోలేని విషాదానికి దారితీయవచ్చు. తాజాగా వైరల్ గా మారిన సీసీటీవీ దృశ్యాలు అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఈ వీడియోను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్.. వీసీ సజ్జనార్ ఐపీఎస్.. సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు..

ఇక్కడ ఒక వ్యక్తి తన పిల్లలను స్కూలు నుండి తమ ఇంటికి తీసుకువచ్చిన క్రమంలో ముందు పెద్ద పిల్లవాడిని బండి నుండి కిందకు దింపుతాడు. ఈ క్రమంలో ఇంటి గేటు తీయడానికి ఆ తండ్రి కూడా బండిని ఆన్ లోనే పెట్టి కిందకు దిగుతాడు. అయితే అతను బండిని వదిలి ఎంత పొరబాటు చేశాడో అప్పుడు అర్థం కాదు.

అదే బండి మీద కూర్చున్న మరో చిన్నారి.. ముందుకు జరిగి ఆ స్కూటీ యాక్సిలరేటర్ ను ఇచ్చింది. అంతే ఇంకే ముంది. రయ్యిన ఆ స్కూటీ ముందుకు దూసుకు పోయింది. ఇదంతా క్షణలో జరిగిపోయింది. అయితే అదే సమయంలో అటుగా ఇతర వాహనాలు వేగంగా రాకపోవడం మంచిది అయ్యింది. ఇక ఆచిన్నారి నడిపిన స్కూటీ వేగంగా కొంత దూరం వెళ్ళి కిందపడిపోయింది.

ఈ ప్రమాదంలో ఆ చిన్నారికి గాయాలు తాకాయో లేదో తెలియదు గాని.. అతని నిర్లక్ష్యం ఆ చిన్నారి ప్రయాణాల మీదకు తెచ్చింది. ఇక సరదాగా బైక్‌పై కూర్చున్న చిన్నారులు.. ఆ క్షణాల్లోనే ప్రమాదం పొంచి ఉందని గుర్తించరు. ఎందుకంటే వారికి బండి ఎక్కి ఆదుకోవడం ఒక ఆట.. యాక్సిలరేటర్ తిప్పడం ఒక ఉత్సాహం. అయితే స్టార్ట్‌లో ఉన్న వాహనంపై వారు తెలియక చేసే చిన్న పొరపాటు క్షణాల్లోనే పెద్ద ప్రమాదంగా మారి ప్రాణాలకు ముప్పు తెచ్చే అవకాశం ఉంది.

అందుకే తల్లిదండ్రులు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనం నిలిపిన వెంటనే ఇంజిన్ ఆఫ్ చేసి, కీని తప్పనిసరిగా తీసేయాలి. అలాగే ఇంజిన్ ఆన్‌లో ఉన్న ద్విచక్ర వాహనంపై పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదు. పిల్లల నవ్వులు, సంబరాలు క్షణాల్లో విషాదంగా మారకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద రక్షణగా మారతాయి.

సురక్షిత ప్రయాణం మన బాధ్యత. ట్రాఫిక్ నియమాలు, భద్రతా ప్రమాణాలను పాటిద్దాం... మన పిల్లలను సురక్షితంగా కాపాడుకుందాం!..

#Viral Video#Parents#Negligence#Vehicles#Accident#Child
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి