Raaka Movie: పుష్ప ఫ్రాంఛైజీస్ తో స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్, ఐకాన్ స్టార్‌గా పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీని సాధించాడు. పుష్ప రెండు భాగాలతో ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది. దీనికి కొనసాగింపుగా మరో పార్ట్ కూడా ఉందని సుకుమార్ సెకండ్ పార్ట్ క్లైమాక్స్‌లో రివీల్ చేశాడు. ఇక, ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలనే చేయాలనుకున్నాడు.
ఈ క్రమంలో చేస్తున్న సినిమానే రాకా. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఇది తెరకెక్కుస్తోంది. దాదాపు 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. దీపిక పడుకొణ్ హీరోయిన్‌గా, సమంత..రష్మిక మందన్న..మృణాల్ ఠాగూర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే, తాజాగా..ఈ సినిమాకి సంబందించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.
అదేమిటంటే, రాకా సినిమాలో అల్లు అర్జున్ నాలుగు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నాడట. తాత, తండ్రి, ఇద్దరు కొడులుగా అల్లు అర్జున్ పాత్రలు ఉన్నాయట. వాస్తవానికి, అట్లీ ముందు తాత, తండ్రి ఇతర సీనియర్ నటులను తీసుకోవాలనుకున్నాడట. కానీ, అల్లు అర్జున్ నాలుగు పాత్రలను తానే చేస్తానని ఆసక్తి చూపించడంతో ముందు కాస్త సందేహించిన అట్లీ, లుక్ టెస్ట్ తర్వాత పూర్తిగా సంతృప్తి చెంది..గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇదే, నిజమైతే టాలీవుడ్ హీరోలలో ఎవరూ చేయని సాహసం ఇది.
దశావతారంలో కమల్ హాసన్ 10 రకాల పాత్రలను పోషించి మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత నాలుగు పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంటే, అల్లు అర్జున్ ని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతారు. చూడాలి, మరి ఇది నిజంగా జరుగుతుందా లేదా. ఇక, ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. అలాగే, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా ఓ సినిమా కమిటైయ్యాడు అల్లు అర్జున్.












