సినిమా

Samantha @ 100: "మా ఇంటి బంగారం" తో సమంత రేర్ రికార్డ్

రచన: Anshu3 నిమిషాల పఠనం

Samantha @ 100: సమంత నటించిన లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో చిత్రబృందం ఆమెకి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ని అందించింది. ఒకప్పుడు, అసలు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను ఎవరైనా చూస్తారా ? అనే సందేహాలు అందరిలోనూ కలిగాయి. అప్పట్లో, విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా ప్రతీ హీరోయిన్ కి ఇన్స్పిరేషన్.

ఆ తర్వాత అరుంధతి సినిమాతో అనుష్క శెట్టి ఇలా ఇన్స్పిరేషన్ గా నిలిచింది. కానీ, పాన్ ఇండియన్ సినిమా ట్రెండ్ మొదలయ్యాక, అందులోనూ ఎక్కువగా హీరోల సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం పెరిగిన తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించాలంటే చాలా ఆలోచించేవారు. అందులోనూ, సమంత లాంటి ఫేడవుట్ హీరోయిన్ అంటే పెద్ద రిస్కే. అయితే, సమంత ఫేడవుట్ అయిందని..అనడానికి ఏమాత్రం ఆస్కారం లేదు.

ఆ విషయం..ఆమె నటించిన లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం మూవీతో ప్రూవ్ అయింది. రాజ్ నిడిమోరు కథతో పాటు నిర్మాణంలో భామయ్యాడు. బీవీ నందినీ రెడ్డి దర్శకత్వం వహించింది. కంటెంట్ అందరికీ నచ్చడంతో సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నిజంగా, ఇలాంటి కంబ్యాక్ సమంత ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎట్టకేలకి, మా ఇంటి బంగారం సినిమాతో 100 కోట్ల హీరోయిన్‌గా సరికొత్త రికార్డ్ ని సాధించింది.

ఈ నేపథ్యంలో సమంతకి చిత్రబృందం సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీనిని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అలాగే, పలువురు స్టార్ హీరోస్, ఇతర నటీనటులు సమంతకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని సమంత భర్త రాజ్ కన్‌ఫర్మ్ చేస్తూ..ఇంకో రెండేళ్ళ తర్వాత ఆ సీక్వెల్ ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం సామ్మ్ ప్రగ్నెంట్. కాబట్టే, తాను మెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది.

#samantha#maaintibangaram#rajnidimoru#bvnandinireddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి