తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) రాసిన లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెట్ పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ నేడు (సోమవారం) అధికారికంగా విడుదల చేయనుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు ఈ ఫలితాలను ప్రకటించనున్నారు.
ఈ ఏడాది నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.15 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉండటంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విద్యాశాఖ ఫలితాలను విడుదల చేసిన వెంటనే అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాల ప్రకటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ ఇప్పటికే పూర్తి చేసింది.
తెలంగాణ టెట్ (TG TET) ఫలితాలను చెక్ చేసుకోవడానికి మరియు మీ స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లింక్ కింద ఇవ్వబడింది. ఫలితాలు విడుదలైన తర్వాత, ఈ లింక్‌పై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయడం ద్వారా మీ మార్కులను చూసుకోవచ్చు.
TG TET Official Website












