రాజకీయాలు

Congress : ‘నామినేటెడ్’ జాతర.. ఒక్కో పోస్టులకు 10 మంది.. మీనాక్షి నిర్ణయం తర్వాతే!

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మరోసారి నామినేటెడ్ పదవుల కోలాహలం నెలకొంది. ఈసారి పెద్దఎత్తున పదవులు భర్తీ చేస్తారని తెలుస్తోంది.ఇందులో ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు, తాజా మాజీ చైర్మన్లు, మంత్రి పదవులు ఆశించి భంగపడిన నేతలు ఎలాగైనా నామినేటెడ్ పోస్టులు దక్కించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో మరోసారి నామినేటెడ్ పదవుల కోలాహలం నెలకొంది. ఈసారి పెద్దఎత్తున పదవులు భర్తీ చేస్తారని తెలుస్తోంది.ఇందులో ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు, తాజా మాజీ చైర్మన్లు, మంత్రి పదవులు ఆశించి భంగపడిన నేతలు ఎలాగైనా నామినేటెడ్ పోస్టులు దక్కించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఒక్కో పోస్టుకు భారీగా ఆశావహులు ఉన్నట్టు తెలుస్తుండగా.. తమకు ఎలాగైనా చాన్స్ ఇవ్వాలని మంత్రుల చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది.మరికొందరు ఏకంగా ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ షురూ చేసినట్టు తెలుస్తోంది.

పనితీరు ఆధారంగానే..

నామినేటెడ్ పదవుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పనితీరు ఆధారంగానే పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇక చైర్మన్ పదవులు అనుభవించి మరోసారి చాన్స్ ఇవ్వాలని ఎదురుచూసే వారిలో కొందరికే మళ్లీ చాన్స్ ఉంటుందని సంకేతాలు సైతం వెళ్లినట్టు తెలుస్తోంది. అందుకే పనితీరును ప్రమాణికంగా తీసుకున్నట్టు తెలిసింది.ఈ క్రమంలోనే ఎవరికి రెన్యువల్ చెయ్యాలి? ఎవరిని పక్కన పెట్టాలి? కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలి? అనే అంశంపై పార్టీ, ప్రభుత్వ పెద్దల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలో తుది నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలిసింది.

14న మీనాక్షి హైదరాబాద్‌కు రానున్నారు. 15 లేదా 16 తేదీల్లో నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా సమావేశమై నామినేటెడ్ పదవుల నియామకం పై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నెల 8న 37 మంది నామినేటెడ్ చైర్మన్ల రెండేళ్ల పదవీకాలం ముగిసింది. ఈ పదవులను దక్కించుకునేందుకు తాజా మాజీ చైర్మన్లు, అసలే పదవులు దక్కని లీడర్లు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

పదవి వస్తే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఉంటుంది. మంత్రులు, అధికారుల వద్దకు ఈజీగా వెళ్లే అవకాశం ఉంటుంది.వీటికి తోడు ప్రభుత్వం కల్పించే వెహికల్, గన్‌మెన్ సౌకర్యంతో రాజకీయంగా పరపతి పెరుగుతుందని కొందరు నేతలు ఆలోచిస్తున్నారు. అందుకే ఎలాగైనా పదవి దక్కించుకునేందుకు లాబీయింగ్ ప్రారంభించినట్టు సమాచారం.కాగా, నామినేటెడ్ పోస్టుల కోసం ఒక్కో పదవికి సుమారు 10 మంది వరకు పోటీ పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

#Nominated posts#cm revanth reddy#meenakshi natarajan#Tpcc cheif mahesh Goud#Congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి