ప్రపంచం

Iran-Us war : క్రూడ్ పైపైకి.. మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఇరాన్ -అమెరికా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. హోర్ముజ్ జలసంధిలోని నౌకలపై ఇరాన్ దాడులలో అమెరికా మరోసారి కయ్యానికి కాలుదువ్వింది.ఇరాన్ మీద బాంబులతో విరుచుకపడింది. దీంతో ఇరాన్ మరోసారి హోర్ముజ్ జలసంధిని మూసివేసింది.ఫలితంగా వివిధ దేశాలకు రవాణా అయ్యే షిప్స్ నిలిచిపోయాయి.

ఇరాన్ -అమెరికా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. హోర్ముజ్ జలసంధిలోని నౌకలపై ఇరాన్ దాడులలో అమెరికా మరోసారి కయ్యానికి కాలుదువ్వింది.ఇరాన్ మీద బాంబులతో విరుచుకపడింది. దీంతో ఇరాన్ మరోసారి హోర్ముజ్ జలసంధిని మూసివేసింది.ఫలితంగా వివిధ దేశాలకు రవాణా అయ్యే షిప్స్ నిలిచిపోయాయి. ఇండియాకు రావాల్సిన ఇంధన నౌకను ఇరాన్ తిప్పి పంపించింది. ప్రస్తుతం భారత నౌకలు సైతం హోర్ముజ్‌లో చిక్కుకుపోయాయి.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు మరోసారి ఎగిసిపడ్డాయి. ఇరాన్ -యూస్ మధ్య యుద్ధమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా, గత రాత్రి ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సెంట్‌కామ్ దళాలు భారీ ఎయిర్ స్ట్రైక్స్ (వైమానిక దాడులు) జరిపాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఫలితంగా అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడాయిల్ ధర ఇవాళ ఒక్కరోజే దాదాపు 3.5% నుంచి 4.30% మేర పెరిగి 79 డాలర్ల మార్కును చేరుకుంది.

చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ పరిధిలో ఇరాన్ దాడులకు దిగడం, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడంతో ఆ మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో రోజుకు 130కి పైగా నౌకలు ప్రయాణించే మార్గంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం నౌకల సంఖ్య భారీగా పడిపోయింది. అమెరికా ఇరాన్‌పై ఆంక్షలను పునరుద్ధరించడం, చమురు ఎగుమతి అనుమతులను రద్దు చేయడంతో మార్కెట్‌ మరింత ఒత్తిడికి గురైంది.

ట్రంప్ ఓవైపు చర్చలకు ఆహ్వానిస్తూనే యుద్ధం చేస్తుండటంతో ఇరాన్ సైతం హోర్ముజ్ ఓపెన్ చేయడం కష్టమని చెబుతోంది. రానున్న రోజుల్లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్రూడాయిల్ ధరలు మరింత పెరిగే చాన్స్ ఉంది.ఫలితంగా ఇండియన్ ఆయిల్ కంపెనీలు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇంధన ధరలు పెరిగితే మరోసారి ద్రవ్యోల్భణం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

#Iran-us war#crude oil#price hike#international market#hormuz stright close#fuel price hike
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి