రాజకీయాలు

Ap : కొనసీమలో చంద్రబాబు పర్యటన.. ధవళేశ్వరం ప్రాజెక్టుకు మహర్దశ

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఏపీలో వాస్తవాలకు దూరంగా ప్రభుత్వంపై అంతులేని ఆరోపణలు చేస్తున్న వారిపై కూటమి సర్కార్ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు మాత్రం చట్టం తన పనిని చేసుకుని పోతుందని చెబుతూనే..

ఏపీలో వాస్తవాలకు దూరంగా ప్రభుత్వంపై అంతులేని ఆరోపణలు చేస్తున్న వారిపై కూటమి సర్కార్ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు మాత్రం చట్టం తన పనిని చేసుకుని పోతుందని చెబుతూనే.. అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలోని రైతాంగానికి సాగు నీరు అందించే కార్యక్రమాలపై సీరియస్‌గా దృష్టిసారించినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆయన కోనసీమ పర్యటనకు వెళ్తున్నారు.

నేడు తూర్పుగోదావరిలోని కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించనున్నారు. 117 పాత వరద గేట్లను మార్చి.. వాటి స్థానంలో కొత్త గేట్ల పనులకు ఆరంభించనున్నారు. కొత్తగేట్ల పనుల కోసం ప్రభుత్వం రూ.152.95 కోట్ల నిధులను ఇప్పటికే మంజూరు చేసింది. కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు పిచ్చుకలంకలో రైతులతో సమావేశం కానున్నారు.

వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అలాగే ప్రభుత్వం నుంచి అందించే సహాయంపై అభిప్రాయం సేకరించనున్నారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులను సైతం సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. పోలవరం ప్రధాన డ్యామ్, విద్యుత్ కేంద్రం, నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఇంకా ఎంత పనులు చేయాల్సి ఉన్నది? నిధుల విడుదలపైనా చర్చిస్తారని తెలుస్తోంది.

#cm chandrababu#konaseema dist#visit#davaleshwaram barraige#gates change
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి