వ్యాపారం

Gold price: నిలకడగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు!

రచన: Mamatha puppala3 నిమిషాల పఠనం

అంతర్జాతీయ మార్కెట్లో భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ, పసిడికి డిమాండ్ స్థిరంగా ఉండటంతో ఆదివారం దేశీయంగా బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు.

అంతర్జాతీయ మార్కెట్లో భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ, పసిడికి డిమాండ్ స్థిరంగా ఉండటంతో ఆదివారం దేశీయంగా బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,44,330 వద్ద స్థిరంగా ఉంది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,300 వద్ద, 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,08,250 వద్ద ఎలాంటి మార్పు లేకుండా ట్రేడ్ అవుతోంది. పసిడి బాటలోనే వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర రూ.2,40,000 వద్దే విక్రయమవుతోంది.

తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, నెల్లూరు, గుంటూరు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర కాస్త ఎక్కువగా రూ.1,45,090గా ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో రూ.1,44,480గా నమోదు కాగా.. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో హైదరాబాద్ మార్కెట్ ధరలనే పోలి ఉన్నాయి. అయితే, స్థానిక పన్నులు, మేకింగ్ ఛార్జీల వల్ల ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉన్నందున కొనుగోలుదారులు లావాదేవీల ముందు ఒకసారి అధీకృత డీలర్ల వద్ద ధరలను సరిచూసుకోవడం మంచిది.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి