సినిమా

Anirudh Ravichander: త్వరలో పెళ్ళి..ఆ అమ్మాయినే ఫిక్స్ చేశారా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Anirudh Ravichander: కోలీవుడ్ స్టార్స్ ధనుష్, శృతి హాసన్ నటించిన 3 సినిమాతో పాపులర్ అయ్యాడు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. 'వై దిస్ కొలవరి డి' అంటూ యువతరాన్ని ఉర్రూతలూగించాడు. ఇప్పుడు అటు తమిళంలో, ఇటు తెలుగులో బిజీ మ్యూజిక్ డైరెక్టర్. అన్నీ కూడా పెద్ద స్టార్స్ నటిస్తున్న సినిమాలే. అంతేకాదు, బాలీవుడ్ లో కూడా షారుఖ్ ఖాన్ సినిమాకి పనిచేస్తున్నాడు. అయితే, తాజాగా ఈ మ్యూజిక్ సెన్షేషన్ పెళ్లికి సంబందించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

గతంలో అనిరుధ్ కి పలువురు స్టార్ హీరోయిన్స్ తో రిలేషన్ ఉందని ప్రచారం జరిగింది. వారిలో శృతి హాసన్, కీర్తి సురేష్ లాంటి వారు కూడా ఉన్నారు. ఒకదశలో కీర్తి..అనిరుధ్ తో డేటింగ్ చేస్తుందని వార్తలు పుట్టాయి. కట్ చేస్తే బిజినెస్ మేన్ తో కీర్తి సురేష్ పెళ్ళి జరిగింది. దాంతో, ఈ రూమర్స్ కి చెక్ పడింది. ఇక, తాజాగా అనిరుధ్ బాబాయ్..ఓ ఇంటర్వ్యూలో.. అతి త్వరలోనే అనిరుధ్ పెళ్ళి ఉంటుందని హింట్ ఇచ్చాడు.

కానీ, వధువు ఎవరనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. అయితే, గత కొన్ని రోజులుగా సన్‌ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్‌ తో అనిరుధ్ రవిచందర్ డేట్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం, కొన్ని చోట్ల వీరిద్దరు కలిసి కెమెరాలకి చిక్కడమే. కానీ, ఈ వార్తలపై అటు కావ్య గానీ, ఇటు రవిచందర్ గానీ క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం మాత్రం అనిరుధ్ పెళ్లి గురించి కోలీవుడ్ మీడియా సర్కిల్స్‌లో బాగా వైరల్ అవుతోంది.

ఇక, అనిరుధ్ సినిమాల విషయానికొస్తే..సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2 కి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న రాకా సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాకి ఈయనే సంగీత దర్శకుడు. ఇవే కాదు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. త్వరలో, అనిరుధ్ పెళ్లి..రిసప్షన్ కి సంబందించిన అప్‌డేట్స్ ని తన కుటుంబ సభ్యులు రివీల్ చేస్తారని తెలుస్తోంది.

#anirudhravichander#kavyamaran#kollywood#tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి