Prabhas: పాన్ ఇండియన్ స్టార్ నటించే సినిమాల కంటే, ఆ సినిమాల బడ్జెట్టే ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంది. బాహుబలి రెండు భాగాల నిర్మాణ సమయంలో ఇలాగే, బడ్జెట్..వసూళ్ల గురించి బాగా చర్చలు జరిగాయి. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమా అంటే రూ.50 కోట్లు మాత్రమే. ఆ తర్వాత అది రూ.100 కోట్లకి చేరింది.
ఇప్పుడు, ఒక్కో పాన్ ఇండియా సినిమా బడ్జెట్ కనీసం రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకూ ఉంటుంది. అయితే, ఇంత భారీ బడ్జెట్ సినిమా గనక బాక్సాఫీస్ వద్ద టాక్ తేడా వస్తే అందరూ మునిగిపోతారు. దీనికి, ఉదాహరణ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్, ది రాజాసాబ్, సాహో సినిమాలే. ఈ సినిమాలపై భారీ అంచనాలుంటే..ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయాయి.
ఇప్పుడు, ఫౌజీ సినిమా విషయంలోనూ ఇలాంటి చర్చలే సాగుతున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా మొదలైనప్పుడు.. అనుకున్న బడ్జెట్ కంటే ఇప్పుడు బాగా పెరిగినట్టుగా ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం, వినిపిస్తున్న టాక్ ప్రకారం రూ.500-600 కోట్ల వరకూ ఫౌజీ సినిమాకి ఖర్చు చేస్తున్నారట.
అయితే, ఇదే బడ్జెట్ గనక నిజమైతే..సినిమా హిట్ అయితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బాగానే లాభాలను చూస్తారు. పొరపాటున ఫ్లాప్ అని టాక్ వస్తే, తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. పీరియాడికల్ కథాంశం, అందులోనూ స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథ కావడంతో భారీ సెట్స్ నిర్మించారట. అందుకే, బడ్జెట్ బాగానే అవుతుందని చెప్పుకుంటున్నారు. చూడాలి, మరి సేఫ్ గా నిర్మాత బయటపడతాడో లేదు. ఇక, ఈ సినిమాతో ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతోంది.












