International

వైరల్ వీడియో: విషాదంగా మారిన విదేశీ ప్రయాణం!..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఆనందం అనుభవించేటప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది.. అందులో విషాదం చోటు చేసుకుంటే మాత్రం.. ఆ అనుభవాన్ని తట్టుకోవడం నరకంగా మారుతుంది.

ఆనందం అనుభవించేటప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది.. అందులో విషాదం చోటు చేసుకుంటే మాత్రం.. ఆ అనుభవాన్ని తట్టుకోవడం నరకంగా మారుతుంది. అందులో మన ఇండియా వదిలి విదేశాలకు వెళ్ళి కాసిన్ని అనుభూతులు, తీపి గుర్తులుగా దాచుకోవాలని ఆశించి.. మరణం బారిన పడటం.. ఆ కుటుంబానికి తీరని క్షోభాగా మారుతుంది.

ప్రస్తుతం ఇలాంటి సంఘటనే వియాత్నంలో చోటు చేసుకుంది. తమ జీవితంలో ఈ ప్రయాణం చివరి ప్రయాణం అవుతుందని గుర్తించని భారతీయులకు ఊహించని విషాదం ఎదురైంది.ఫూ క్వాక్‌ ద్వీపం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న స్పీడ్‌ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది భారత టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

వారిలో రెండు తెలుగు రాష్ట్రాల వాసులున్నారు. కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్‌ శ్రీధర్‌, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ మరణించారు. కడపకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్‌ నయీం ఒడ్డున ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నట్టు సమాచారం..

ఓ ప్రముఖ మొబైల్ కంపెనీ తమ డిస్ట్రిబ్యూటర్లు, వారి కుటుంబాలతో కలిసి వియత్నాం టూర్‌ను ఏర్పాటు చేసింది. మొత్తం 250 మంది ఈ యాత్రలో పాల్గొనగా, వారిలో ఏపీ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నారు.

టూర్‌లో భాగంగా సముద్ర విహారానికి వెళ్లిన మూడు బోట్లలో ఒక స్పీడ్ బోట్‌ ప్రమాదానికి గురైంది. హాన్ మే రుట్‌ నుంచి అన్ థోయ్ పోర్టుకు బయల్దేరిన ఈ బోటులో 32 మంది భారతీయులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. తీరానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉండగా ఒక్కసారిగా బోటు బోల్తా పడటంతో అందులోని ప్రయాణికులు సముద్రంలో చిక్కుకున్నారు.

ప్రమాదాన్ని గమనించిన సమీప పర్యాటక బోట్ల సిబ్బంది వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే బోటు పూర్తిగా తలకిందులు కావడం, సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. బాధితుల కుటుంబాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

మరిన్ని వివరాల కోసం +84 36 281 7930.. +84 91 552 3714.. +84 33 452 0414.. నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొంది. అలాగే, హనోయిలోని భారత రాయబార కార్యాలయంలో కూడా మరో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన హెల్ప్‌లైన్ నంబర్.. +84 91 308 9165.. బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఇతర సమాచారం కోసం ఈ నంబర్లను సంప్రదించాలని భారత అధికారులు సూచించారు. అలాగే ఇండియాలో సంప్రదించవలసిన నెంబర్లు.. 9885371189.. 7997959754.. 9989654807.. 7997959779.. అని పేర్కొన్నారు..

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి