రంగారెడ్డి జిల్లా షాబాద్ లో జరిగిన వరుస హత్యల ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశం పై బిఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ అంశంపై స్పందించారు.. ఈ సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ.. రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు..
ఒక వ్యక్తి ఆరుగురి మరణానికి కారణం కావడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. ముఖ్యంగా హోంశాఖను తనవద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలులో విఫలమైయ్యారని ఆరోపించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన హోంమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే తాము కట్టుబడి ఉన్నామని, ప్రజా ప్రభుత్వం అందుకోసమే నిర్విరామంగా కృషి చేస్తుందని మాట్లాడుతున్న సీఎం..లా అండ్ ఆర్డర్ ను కాపాడటంలో ఎందుకు విఫలం అవుతున్నట్టో వివరించాలని పేర్కొన్నారు..
మీ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తే.. రాష్ట్రంలో జరుగుతున్న ఆరాచకాలు, హత్యల సంఖ్య ఎందుకు పెరుగుతుందని ప్రశ్నించారు. మరోవైపు బిఆర్ఎస్ నేతలు అనవసర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు.. రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటనను రాజకీయం చేస్తూ.. బిఆర్ఎస్ నేతలు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.
గుంటకాడి నక్క అని పేరు తెచ్చుకున్న హరీష్ రావు.. సొంత పార్టీలో గుర్తింపు కోల్పోయి మతి తప్పి మాట్లాడుతున్నారని అధికారపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయిన చట్టం తనపని తాను చేస్తుంటే.. అనవసరంగా నిందలు వేస్తూ.. సమస్యను రాజకీయ లాభం కోసం వాడుకుంటున్నాడాని దుయ్యబట్టారు..
మరోవైపు షాబాద్ మండల పరిధిలోని దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్.. పోక్సో కేసులో అరెస్టై బెయిల్ పై తిరిగి వచ్చి.. కట్టుకున్న భార్యను, తన ఇద్దరు కొడుకులు, తనపై పోక్సో కేసుపెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లిని, నానమ్మలను హత్య చేసిన విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.












