Varun Tej: కెరీర్ ప్రారంభం నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంచుకుంటున్న కథల్లో చాలా వైవిధ్యం కనిపిస్తోంది. కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్స్ ని మాత్రమే కాకుండా అన్నీ రకాల జానర్ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు, ఎఫ్ 2..ఎఫ్ 3 లాంటి ఫన్ ఎంటర్‌టైనింగ్ మల్టీస్టారర్ మూవీస్ తోనూ సాలీడ్ హిట్స్ అందుకున్నాడు.
ఈసారి ఓ కొత్త రకమైన కథాంశంతో మన ముందుకు రాబోతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రెడీ అవుతోంది 'కొరియన్ కనకరాజు'. ఇందులో, వరుణ్ విలేజ్ లో ఉండే కనకరాజు పాత్రలో కనిపించనున్నాడు. అయితే, అతనిలోకి కొరియన్ దెయ్యం వస్తే ఆ తర్వాత పరిణామాలేంటి అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

వరుణ్ తేజ్ ఇప్పటి వరకూ చేయనటువంటి ఓ కొత్త తరహా పాత్ర ఇది. ఈ సినిమా కోసం, రాయలసీమ యాసతో పాటు కొరియన్ భాషలో లెంగ్త్ ఎక్కువగా ఉన్న డైలాగులను నేర్చుకోవడం బావుంది. నిన్నా మొన్నటి వరకూ 'కొరియన్ కనకరాజు' టైటిల్ గానీ, పోస్టర్ గానీ, వరుణ్ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్న రితిక నాయక్ గానీ సినిమాపై పెద్ద ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయలేదు.
కానీ, తాజాగా వచ్చిన ట్రైలర్ చూశాక, దీనికి థమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం విన్నాక, వరుణ్ తేజ్-సత్య పర్ఫార్మెన్స్ చూశాక గ్యారెంటీగా బ్లాక్ బటర్ అనే నమ్మకాలు కలిగాయి. ముఖ్యంగా, వరుణ్ క్యారెక్టర్ ఫన్ తో కూడుకున్న యాక్షన్ మోడ్ లో ఉండటం చాలా ఆసక్తిని కలిగింది. ఈ ఆగస్టు 7వ తేదీన థియేటర్స్‌లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.












