International

America: అమెరికా వెళ్లే వారికి షాక్.. కొత్త రూల్ పెట్టిన ట్రంప్!..

రచన: Venu4 నిమిషాల పఠనం

మెరికా ప్రభుత్వం కొత్తగా శాశ్వత వీసా బాండ్ ప్రోగ్రామ్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం ఎంపిక చేసిన 50 దేశాల నుంచి బీ-1 (బిజినెస్), బీ-2 (టూరిస్ట్) వీసాలపై అమెరికా వెళ్లే దరఖాస్తు దారులు ముందుగానే గరిష్ఠంగా 20 వేల అమెరికన్ డాలర్ల వరకు బాండ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఒక రోజు ఒక ప్రకటన, మరుసటి రోజు మరో నిర్ణయంతో ఆయన వ్యవహారశైలి పై ప్రపంచ వ్యాప్తంగా విభిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం పిడుగులాంటి వార్త చెప్పింది.

అమెరికా ప్రభుత్వం కొత్తగా శాశ్వత వీసా బాండ్ ప్రోగ్రామ్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం ఎంపిక చేసిన 50 దేశాల నుంచి బీ-1 (బిజినెస్), బీ-2 (టూరిస్ట్) వీసాలపై అమెరికా వెళ్లే దరఖాస్తు దారులు ముందుగానే గరిష్ఠంగా 20 వేల అమెరికన్ డాలర్ల వరకు బాండ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా పరీక్షించిన అమెరికా ప్రభుత్వం.. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో అక్రమంగా ఉండిపోయే వారి సంఖ్య తగ్గినట్లు గుర్తించింది.

దీంతో కొన్ని మార్పులు చేసి దీనిని శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. గతంలో బాండ్ మొత్తాలు 5 వేల, 10 వేల, 15 వేల డాలర్లుగా ఉండేవి. అయితే తాజా నిబంధనల్లో 5 వేల డాలర్ల ఎంపికను తొలగించి... గరిష్ఠ పరిమితిని 20 వేల డాలర్లకు పెంచారు. కొత్త నిబంధనలు ఆగస్టు 3, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ నిబంధనలు అందరికీ వర్తించవని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది.

అమెరికాలో వీసా గడువు దాటిన తర్వాత కూడా ఎక్కువ మంది అక్రమంగా ఉండిపోతున్నట్లు గుర్తించిన 50 దేశాల పౌరులకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. ఈ జాబితాలో ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలోని కొన్ని దేశాలు ఉన్నాయి. అయితే భారత్ ఈ జాబితాలో లేకపోవడంతో ఇండియన్స్ కు కొంత ఊరట లభించింది..

మరోవైపు ఈ బాండ్ విధానం ఉన్న దేశాల వారు అమెరికాకు కేవలం కమర్షియల్ విమానాల ద్వారానే ప్రయాణించాలి. వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైనా... లేదా వీసా గడువు ముగిసేలోపు అమెరికా విడిచి స్వదేశానికి తిరిగి వచ్చినా... డిపాజిట్ చేసిన బాండ్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తారు. కానీ వీసా గడువు ముగిసినా అక్కడే అక్రమంగా ఉంటే.. ఆ బాండ్ మొత్తాన్ని అమెరికా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది..

#International News#America#Visa bond program#Trump#new rule
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి