సినిమా

Chiru-Nag: భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి..!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Chiru-Nag: ఒకప్పుడు, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో భారీ మల్టీస్టార్స్ వచ్చేవి. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, కాజోల్, హృతిక్ రోషన్, కరీనా కపూర్, జయా బచ్చన్..లతో 'కభీ ఖుషీ కభీ ఘమ్', అమితాబ్ బచ్చన్..షారుఖ్ ఖాన్..ఐశ్వర్యరాయ్ కాంబినేషన్‌లో 'మొహబ్బతేన్' లాంటి మల్టీస్టారర్స్ వచ్చి బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాలను అందుకున్నాయి.

Chiru-Nag: ఒకప్పుడు, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో భారీ మల్టీస్టార్స్ వచ్చేవి. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, కాజోల్, హృతిక్ రోషన్, కరీనా కపూర్, జయా బచ్చన్..లతో 'కభీ ఖుషీ కభీ ఘమ్', అమితాబ్ బచ్చన్..షారుఖ్ ఖాన్..ఐశ్వర్యరాయ్ కాంబినేషన్‌లో 'మొహబ్బతేన్' లాంటి మల్టీస్టారర్స్ వచ్చి బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాలను అందుకున్నాయి.

ఇవే కాదు, 'తాళ్'..'రేస్'..'డాన్'..'ధూమ్' సిరీస్ కూడా ఇలాంటి భారీ మల్టీస్టార్సే. అలాంటి, సినిమాలు మన తెలుగులో బాహుబలి సిరీస్ తో మొదలైయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా లాంటి సినిమాలలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇలా కొన్ని సెకన్ల పాటు కనిపించారే తప్ప..పూర్తి స్థాయి పాత్రల్లో మరిపించలేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, ఎఫ్ 2, ఎఫ్ 3, మన శంకరవరప్రసాద్‌గారు లాంటి సినిమాలు మన టాలీవుడ్ లో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

ఇలాంటి మల్టీస్టారర్స్ తీయగల సత్తా రాజమౌళి, అనిల్ రావిపూడిలకే ఉందని నిరూపించుకున్నారు. అయితే, సీనియర్ హీరోలతో సినిమాలు తీసి హిట్ కొట్టిన ఘనత అనిల్ రావిపూడికి దక్కింది. అంతేకాదు, చిరు-వెంకీలని ఒకే ఫ్రేమ్ లో చూపించి మెప్పించిన దర్శకుడు కూడా ఈయనే. అనిల్ రావిపూడి ఒక్క నాగార్జున తో తప్ప మిగతా ముగ్గురు సీనియర్స్‌తో హిట్స్ తీశాడు.

ఇక, 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా సమయంలో మిగిలింది నాగార్జున. ఆయనతో కూడా సినిమా చేస్తానని ఓపెన్ గా చెప్పాడు. ఇప్పుడు, ఆ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్టు సమాచారం. ఈ సినిమాను మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నాడట. నాగార్జునతో పాటు మెగాస్టార్ కూడా కనిపిస్తాడని..వీరిద్దరికి తగ్గ కథ రెడీ అవుతున్నట్టుగా ఇన్‌సైడ్ టాక్. చిరు, నాగ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్సో అందరికీ తెలిసిందే. ఈ హిట్ మెషిన్ గనక నిజంగా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తే, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల హంగామా ఊహించలేము. ప్రస్తుతం, అనిల్ రావిపూడి.. వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టిలతో మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఇప్పటికే, ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది.

#anilravipudi#chiranjeevi#nagarjuna#venkatesh#kalyanram#balakrishna
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి