సినిమా

S S Rajamouli: 'వారణాసి' తర్వాత 'మర్యాదరామన్న' లాంటి సినిమానే!

రచన: Anshu4 నిమిషాల పఠనం

S S Rajamouli: ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా వారణాసి సినిమాను రూపొందిస్తున్నాడు. కొన్నేళ్ళ నుంచి అనుకుంటున్న కాంబినేషన్. అంతేకాదు, ఎన్నో ఏళ్ళ క్రితమే శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత డా.కె.ఎల్.నారాయణ రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాడు. కానీ, పలు కారణాల వల్ల ఇన్నేళ్ళకి ఈ సూపర్ కాంబో సెట్ అయింది.

S S Rajamouli: ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా వారణాసి సినిమాను రూపొందిస్తున్నాడు. కొన్నేళ్ళ నుంచి అనుకుంటున్న కాంబినేషన్. అంతేకాదు, ఎన్నో ఏళ్ళ క్రితమే శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత డా.కె.ఎల్.నారాయణ రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాడు. కానీ, పలు కారణాల వల్ల ఇన్నేళ్ళకి ఈ సూపర్ కాంబో సెట్ అయింది.

అయితే, వారణాసి ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని, రాజమౌళి ఇంత హై స్కేల్ సినిమాను రూపొందిస్తారని ఏ ఒక్కరూ ఊహించలేదు. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ మాదిరిగానే ఊహించుకున్నారు. కానీ, వారణాసి అంతకంత రెట్టింపు స్థాయిలో ఉంటుందని గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ తో అర్థమైంది. గ్లింప్స్ లో కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికే మహామహులకి చాలా సమయం పట్టింది.

120 దేశాలలో 20 అంతర్జాతీయ భాషలలో వారణాసి చిత్రాన్ని 2027, ఏప్రిల్ 7న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో రాత్రింబవళ్ళు పనిచేస్తున్నాడు. ఇలాంటి సినిమాకి ఎంత మానసిక, శారీరక ఒత్తిడి ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. అందుకే, వారణాసి తర్వాత ఒక చిన్న సినిమాను తీయాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఒక దశలో 'సింహాద్రి', 'చత్రపతి, 'విక్రమార్కుడు', 'యమదొంగ', 'మగధీర' లాంటి సినిమాలు తీసి చాలా ఒత్తిడికి గురైయ్యాడు. అలాంటి సమయంలో చిన్న సినిమా చేయాలనుకొనే.. సునీల్-సలోనిలతో 'మర్యాదరామన్న' తీసి హిట్ కొట్టాడు. ఈ సినిమాలో కూడా ఆయన స్టైల్ మేకింగ్ ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే, అంత భారీ చిత్రాలతో హ్యూజ్ హిట్స్ అందుకున్నా కూడా.. 'మర్యాదరామన్న' సినిమానే ఇష్టమని పలు సందర్భాలలో రాజమౌళి చెప్పడం. ఇప్పుడు, కూడా 'వారణాసి' లాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తర్వాత కూల్ గా, రిలాక్స్డ్ గా 'మర్యాదరామన్న' లాంటి చిన్న సినిమా చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. దీనిపై, రాజమౌళినే అమాధానం ఇస్తే గానీ నమ్మరు.

#ssrajamouli#rajamouli#varanasi#maheashbabu#priyankachopra
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి