National

Rahul Gandhi: వివాదాస్పదంగా అయోధ్య విరాళాల చోరీ స్కిట్.. రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్!..

రచన: Venu4 నిమిషాల పఠనం

అయోధ్య రామమందిర విరాళాల్లో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షం ఆరోపించింది. ఈ నిరసనలో చందా చోర్, గద్దీ ఛోడ్, జవాబ్ తుమ్‌కో దేనా హోగా, అమిత్ షా, సదన్ మే ఆవో అంటూ నినాదాలు చేశారు.

అయోధ్య రామమందిరం విరాళాల వ్యవహారంపై పార్లమెంట్ ఆవరణలో జరిగిన నిరసన కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, మతపరమైన చర్చకు దారితీసింది. చందా చోరీ ఆరోపణల నేపథ్యంలో ఇండియా కూటమి ఎంపీలు నిర్వహించిన స్కిట్ వివాదాస్పదంగా మారింది.

పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, చేతిలో శ్రీరాముడి చిత్రాన్ని పట్టుకుని ఆలయ పూజారి పాత్రలో నటించారు. భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నట్లుగా ఆయన చేసిన ప్రదర్శన ద్వారా అయోధ్య రామమందిర విరాళాల్లో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షం ఆరోపించింది. ఈ నిరసనలో చందా చోర్, గద్దీ ఛోడ్, జవాబ్ తుమ్‌కో దేనా హోగా, అమిత్ షా, సదన్ మే ఆవో అంటూ నినాదాలు చేశారు.

అయితే ఈ స్కిట్‌పై సాధు సమాజం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సనాతన ధర్మాన్ని, హిందూ సంప్రదాయాలను, శ్రీరాముడి గౌరవాన్ని అవమానించేలా ఈ ప్రదర్శన జరిగిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సాధువులు స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదుపై కాశీ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ బన్స్వాల్ స్పందించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను పరిశీలిస్తున్నామని, అందిన ఫిర్యాదు ఆధారంగా కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాత తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎంపీ పప్పు యాదవ్, అవధేశ్ ప్రసాద్‌ల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదయ్యాయి.

దీంతో ఈ వ్యవహారం రాజకీయాల్లో హిట్ పుట్టించింది.. ప్రతిపక్షం నేతలు ఇది అవినీతి ఆరోపణలపై ప్రజాస్వామ్య నిరసన మాత్రమేనని వాదిస్తుండగా, మరోవైపు ఇది మత విశ్వాసాలను దెబ్బతీసే చర్య అని సాధు సమాజం, ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్న అంశాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.

#National News#congress#bjp#Ayodhya donation#FIR#Rahul Gandhi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి