సినిమా

Fauzi - Jayaprada: ప్రభాస్ కి తల్లిగా సీనియర్ నటి!

రచన: Anshu3 నిమిషాల పఠనం

Fauzi Jayaprada: మన దర్శకులు సీనియర్ నటీనటులను తమ సినిమాల ద్వారా అవకాశాలు ఇచ్చి రీ ఎంట్రీకి కారణం అవుతున్నారు. రాధే శ్యామ్ సినిమాలో భాగ్యశ్రీ నటించిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ళ తర్వాత, అది కూడా తెలుగు స్ట్రైట్ మూవీలో భాగ్యశ్రీ నటించింది. ఆమె పాత్ర బాగా మెప్పించింది.

Fauzi - Jayaprada: మన దర్శకులు సీనియర్ నటీనటులను తమ సినిమాల ద్వారా అవకాశాలు ఇచ్చి రీ ఎంట్రీకి కారణం అవుతున్నారు. రాధే శ్యామ్ సినిమాలో భాగ్యశ్రీ నటించిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ళ తర్వాత, అది కూడా తెలుగు స్ట్రైట్ మూవీలో భాగ్యశ్రీ నటించింది. ఆమె పాత్ర బాగా మెప్పించింది.

ఇక, ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మరో పీరియాడికల్ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇన్స్టా ఫేమ్ ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. అయితే, తాజా సమాచారం మేరకు ఫౌజీ సినిమాలో ప్రభాస్ తల్లిగా అలనాటి అందాల తార, ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కి హిట్ పెయిర్ అయిన జయప్రద తల్లి పాత్రలో నటిస్తుందట.

ఇప్పటికే, ప్రభాస్-జయప్రదలపై ఎమోషనల్ సీన్స్ ని కూడా హను రాఘవపూడి షూట్ చేసినట్టుగా సమాచారం. జయప్రద సినిమాలలో నటించి ఎన్నో ఏళ్ళు అవుతోంది. బుల్లితెర మీద మాత్రం ఈ మధ్య ఒక షోలో సందడి చేశారు. కమల్ హాసన్ నటించిన దశావతారం సినిమా తర్వాత మళ్ళీ కనిపించలేదు. కథలో, ఎంతో కీలకమైన పాత్ర గనకనే ఫౌజీ సినిమాను ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇక, ఆ మధ్య జయప్రద కూడా మళ్ళీ స్క్రీన్ మీద ఓ మంచి పాత్ర ద్వారా మీ ముందుకు రాబోతున్నానే హింట్ కూడా ఇచ్చారు. కాగా, ఈ ఏడాది డిసెంబర్ లో పాన్ ఇండియా వైడ్‌గా ఫౌజీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక, జయప్రదకి, కృష్ణం రాజు ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు కలిసి ‘తాండ్ర పాపారాయుడు’, ‘మధుర స్వప్నం, సీతారాములు, అగ్ని పూలు, యుద్ధం, రంగూన్ రౌడీ, కురుక్షేత్రం, ప్రళయ రుద్రుడు, సర్దార్, అడవి సింహాలు, లాంటి చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్నారు.

#jayaprada#prabhas#fauji#hanuraghavapudi#imanvi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి