Health

Health: 40 తర్వాత కూడా ఫిట్‌గా ఉండాలంటే.. ఇలా చేయవలసిందేనా?..

రచన: Venu5 నిమిషాల పఠనం

ఒక వ్యక్తికి 40 ఏళ్లు దాటడం అంటే వృద్ధాప్యం ప్రారంభమైందని కాదు.. శరీరం ఇచ్చే హెచ్చరికలను గమనించాల్సిన సమయం వచ్చిందనే అర్థం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వయసులో ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి.

ఒక వ్యక్తికి 40 ఏళ్లు దాటడం అంటే వృద్ధాప్యం ప్రారంభమైందని కాదు.. శరీరం ఇచ్చే హెచ్చరికలను గమనించాల్సిన సమయం వచ్చిందనే అర్థం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వయసులో ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. అలసట, మూడ్ స్వింగ్స్, నిద్ర సమస్యలు, బరువు పెరగడం, కండరాల బలం తగ్గడం, ఎముకల సాంద్రత తగ్గడం వంటి మార్పులు సహజమే.

మెటబాలిజం నెమ్మదించడం వల్ల బరువు తగ్గడం కూడా కాస్త కష్టంగా మారుతుంది. దీంతో పాటు థైరాయిడ్, బీపీ, మధుమేహం వంటి సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది.

అయితే.. సరైన జీవనశైలితో ఈ సమస్యలను చాలా వరకు నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం అరగంట వేగంగా నడవడం, యోగా, డ్యాన్స్ లేదా ఇతర శారీరక వ్యాయామాలు చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..

ముఖ్యంగా వారానికి కనీసం రెండు రోజులు కండరాలను బలోపేతం చేసే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలని అమెరికా CDC కూడా సూచిస్తోంది. ఇది కండరాల బలాన్ని పెంచడమే కాకుండా, ఎముకలను దృఢంగా ఉంచడంలో, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇక ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలని, పప్పులు, గుడ్లు, పెరుగు, పనీర్, చేపలు, మొలకలు వంటి ఆహారాలు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే తెల్ల బియ్యం, మైదా వంటి శుద్ధి చేసిన పదార్థాల బదులుగా దంపుడు బియ్యం, జొన్నలు, రాగులు, సజ్జలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, అదేవిధంగా ప్రతిరోజూ తగినంత పీచు పదార్థాలు తీసుకోవాలని స్టాన్‌ఫోర్డ్ మెడిసిన్ సైతం సూచిస్తోంది. మరోవైపు హార్మోన్ల సమతుల్యత కోసం ఆరోగ్యకరమైన కొవ్వులను పూర్తిగా మానేయకూడదు. విటమిన్ B12, ఐరన్, జింక్ వంటి పోషకాల లోపం ఈ వయసులో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.

ఖర్జూరం, పాలకూర, బీట్‌రూట్ వంటి ఐరన్ ఆహారాలను విటమిన్ C ఉన్న పదార్థాలతో కలిపి తీసుకుంటే శరీరం ఐరన్‌ను బాగా గ్రహిస్తుంది. అల్లం, పసుపు, వెల్లుల్లి వంటి పదార్థాలు దీర్ఘకాలిక వాపును తగ్గించడంలో ఉపయోగపడవచ్చని తెలుపుచున్నారు..

అలాగే తగినంత నీరు తాగడం, ప్రతిరోజూ కొద్దిసేపు ఉదయం ఎండలో ఉండడం ద్వారా విటమిన్ D లభిస్తుంది. ముఖ్యంగా.. ప్రతి ఏడాది ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందుగానే గుర్తించి నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు..

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. 40 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే మ్యాజిక్ అవసరం లేదు. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, సరిపడ నిద్ర, మానసిక ప్రశాంతత, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు... ఇవే ఆరోగ్యకరమైన జీవితానికి నిజమైన పెట్టుబడిని హెల్త్ ఎక్స్ పర్ట్స్ తెలియచేస్తున్నారు..

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#Womens#Mens#after 40#fit Body#Metabolism
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి