Spirituality

Spirituality: తీర్థం తీసుకుంటే పాపాలు పోతాయా?.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?..

రచన: Venu5 నిమిషాల పఠనం

ఆగమ శాస్త్రాలు, ఆలయ సంప్రదాయాల ప్రకారం వివిధ దేవాలయాల్లో వివిధ రకాల తీర్థాలను అందిస్తారు. సాధారణంగా జల తీర్థం, కషాయ తీర్థం, పంచామృత తీర్థం, పానక తీర్థం ప్రధానంగా కనిపిస్తాయి. అలాగే ప్రత్యేక ఉత్సవాలు, దేవతా ఆరాధనను బట్టి తులసి తీర్థం, బిల్వ తీర్థం, పచ్చకర్పూర తీర్థం వంటి వాటిని కూడా పంచడం ఆనవాయితీ.

భారతీయ సనాతన సంప్రదాయంలో ఆలయ దర్శనం కేవలం దేవుడిని చూసి రావడం మాత్రమే కాదు... ఆ దర్శనం పూర్తయిన తర్వాత భక్తుడు స్వీకరించే తీర్థం కూడా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక "తీర్థం" అనే పదానికి దుఃఖాలను.. పాపాలను దాటించేది లేదా మనస్సును పవిత్రం చేసేది అని అర్థం. అందుకే పూజ అనంతరం ఇచ్చే తీర్థాన్ని దైవానుగ్రహానికి ప్రతీకగా స్వీకరిస్తారు.

ఆగమ శాస్త్రాలు, ఆలయ సంప్రదాయాల ప్రకారం వివిధ దేవాలయాల్లో వివిధ రకాల తీర్థాలను అందిస్తారు. సాధారణంగా జల తీర్థం, కషాయ తీర్థం, పంచామృత తీర్థం, పానక తీర్థం ప్రధానంగా కనిపిస్తాయి. అలాగే ప్రత్యేక ఉత్సవాలు, దేవతా ఆరాధనను బట్టి తులసి తీర్థం, బిల్వ తీర్థం, పచ్చకర్పూర తీర్థం వంటి వాటిని కూడా పంచడం ఆనవాయితీ. జల తీర్థం అంటే దేవుని అభిషేకం లేదా పూజలో పవిత్రీకరించిన నీరు.

దీనిని భక్తితో స్వీకరించడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుందని, దైవస్మరణ బలపడుతుందని శాస్త్రాలు వివరిస్తాయి. కొంతమంది గ్రంథాలు దీనివల్ల పాపక్షయం, శుభఫలితాలు కలుగుతాయని పేర్కొంటాయి.

ఇక కషాయ తీర్థంలో సాధారణంగా తులసి, మిరియాలు, శొంఠి, యాలకులు వంటి ఔషధ గుణాలు కలిగిన పదార్థాలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా దక్షిణ భారత ఆలయాల్లో ఇది ప్రసిద్ధి. ఆయుర్వేద దృష్టిలో ఈ పదార్థాలు జీర్ణక్రియకు, శరీరానికి కొంత మేలు చేయవచ్చని భావిస్తారు.

పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో చేసే అభిషేకం అనంతరం లభించే పవిత్ర ప్రసాదం పంచామృత తీర్థం.. ఈ ఐదు పదార్థాలు పంచభూతాలకు, పవిత్రతకు ప్రతీకలుగా భావించబడతాయి. దీన్ని స్వీకరించడం ద్వారా జీవితంలో శుభం, ఐశ్వర్యం, కార్యసిద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం..

ఇక పానక తీర్థం ప్రధానంగా శ్రీరాముడు, నరసింహస్వామి ఆలయాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. బెల్లం, మిరియాలు, ఏలకులతో తయారయ్యే ఈ పానీయం శరీరానికి శక్తినివ్వడంతో పాటు, దైవానుగ్రహానికి సంకేతంగా భావిస్తారు.

అలాగే తులసి తీర్థం విష్ణు ఆరాధనలో, బిల్వ తీర్థం శివారాధనలో ప్రత్యేక ప్రాధాన్యం పొందాయి. అలాగే తీర్థాన్ని స్వీకరించే విధానానికీ శాస్త్రాల్లో ప్రాముఖ్యత ఉంది. కుడి చేతిని గోకర్ణ ఆకారంలో ఉంచి, భక్తి-శ్రద్ధలతో మూడు చిన్న ముద్దలుగా స్వీకరించడం సంప్రదాయం. తలపై కొద్దిగా చల్లుకోవడం కూడా అనేక ప్రాంతాల్లో కనిపించే ఆచారం. అయితే తీర్థం యొక్క మహిమ నీటిలో కాదు.. మన భక్తిలో ఉంటుందని పండితులు చెబుతున్నారు..

అలాగే దైవాన్ని స్మరిస్తూ, వినయంతో, విశ్వాసంతో స్వీకరించిన తీర్థం మనసుకు ప్రశాంతతను, జీవితానికి సానుకూల దృక్పథాన్ని అందిస్తుందని సనాతన ధర్మం బోధిస్తోంది. అదే తీర్థం వెనుక ఉన్న నిజమైన ఆధ్యాత్మిక పరమార్థం.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంకేతిక సమాచారం. సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలని మనవి..

#spirituality#Indian Culture#Teertham#scriptures#Temple
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి