Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి రోల్ చేసినా, అది అన్నీ వర్గాల ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డాన్స్ కి మెగాస్టార్ పెట్టింది పేరు. ఫైట్స్ కూడా ఆయన చేసినంత స్టైల్ గా మరో టాలీవుడ్ హీరో చేయడని అంటారు. అది, వాస్తవం. ఇక, తండ్రీకొడుకులుగా చిరు అలరించిన విధానం వెండితెరపై మరో అద్భుతం. అయితే, తాజా సమాచారం మేరకు, మరోసారి మన మెగాస్టార్ తండ్రీకొడులుగా కనిపించబోతున్నారట.
స్నేహకోసం:

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా స్నేహం కోసం. ఈ సినిమాలో చిరు పాత్రలు అద్భుతంగా డిజైన్ చేశారు. స్నేహితులుగా, తండ్రీకొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రలను పోషించడం ఆయనకే చెల్లింది. రవికుమార్ కి వయసు మళ్ళిన స్నేహితుడి పాత్రలో ఉండే సహజత్వం కన్నీళ్ళు తెప్పిస్తుంది. ఇక, తండ్రీకొడుకులుగా స్క్రీన్ మీద పండించిన ఎమోషన్స్ కి గుండెలు బరువెక్కుతాయి. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. చిరు మాత్రం రెండు పాత్రల్లో బాగా ఆకట్టుకున్నాడు.
అందరివాడు:

శ్రీను వైట్ల దర్శకత్వంలో చిరంజీవి తండ్రికొడుకులుగా నటించిన మరో సూపర్ హిట్ సినిమా అందరివాడు. ఈ సినిమాలో గోవిందు, సిద్ధార్థ్ అనే రెండు భిన్నమైన పాత్రల్లో నటించాడు. తండ్రీకొడుకుల మధ్య ఉండే బంధం..ఎమోషన్స్ తో పాటు పొట్ట చెక్కలయ్యే కామెడీ ఈ సినిమాకి ప్రధాన బలం. అంతేకాదు, రెండు గెటప్పుల్లో చిరు పర్ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులు విజిల్స్‌తో థియేటర్స్ లో మోత మోగించారు.
మరోసారి మెగాస్టార్ డ్యూయల్ రోల్:
బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఓ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. అనస్వర రాజన్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో, కూడా చిరు రెండు విభిన్నమైన పాత్రల్లో (తండ్రీకొడులు) అలరించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకముందు చిరు-బాబీ కాంబినేషన్‌లో వాల్తేరు వీరయ్య వచ్చి భారీ హిట్‌గా నిలిచింది. దీంతో, ఈ సినిమాలో రెండు పాత్రలను ఎలా మలచబోతున్నారనే ఆసక్తి అందరిలో ఉంది. కాగా, కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.












