Health

Health: పిల్లల్లో పెరుగుతున్న షుగర్ ముప్పు.. ఈ అలవాట్లు మార్చితే అనారోగ్యానికి చెక్!..

రచన: Venu5 నిమిషాల పఠనం

ఊబకాయం ఉన్న పిల్లల్లో టైప్-2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం సాధారణ బరువు ఉన్న పిల్లలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అయితే డయాబెటీస్‌కు ఒక్క అలవాటే కారణం కాదు. జన్యుపరమైన అంశాలు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం వంటి అనేక కారణాలు కలిసి ఈ ప్రమాదాన్ని పెంచుతాయి.

ఒకప్పుడు పిల్లలు పాఠశాల ముగిసిన వెంటనే ఆడుకోవడానికి బయటికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొబైల్ ఫోన్లు, టీవీలు, ట్యాబ్ లు, వీడియో గేమ్స్‌ ముందు గంటల తరబడి గడపడం.. మరోవైపు పిజ్జా, బర్గర్లు, చిప్స్, చక్కెర పానీయాలు వంటి అధిక కేలరీల ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఊబకాయం వేగంగా పెరుగుతోంది.

వైద్యుల ప్రకారం, ఊబకాయం ఉన్న పిల్లల్లో టైప్-2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం సాధారణ బరువు ఉన్న పిల్లలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అయితే డయాబెటీస్‌కు ఒక్క అలవాటే కారణం కాదు. జన్యుపరమైన అంశాలు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం వంటి అనేక కారణాలు కలిసి ఈ ప్రమాదాన్ని పెంచుతాయి.

అందుకే చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడం చాలా ముఖ్యం. పిల్లలు ప్రతిరోజూ కనీసం 60 నిమిషాలు పరుగు, సైక్లింగ్, ఈత లేదా ఇతర క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీర బరువును నియంత్రించడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని అంటున్నారు.

అలాగే ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన ధాన్యాలు, పప్పుధాన్యాలు, పాలు, పెరుగు, గుడ్లు, గింజలు వంటి పోషకాహారాన్ని చేర్చాలని, కూల్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూస్‌లు, అధిక చక్కెర ఉన్న స్నాక్స్‌కు బదులుగా నీరు, మజ్జిగ లేదా ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన పానీయాలు ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు.

మరోవైపు ఎక్కువసేపు మొబైల్ లేదా టీవీ ముందు కూర్చోవడం వల్ల శారీరక చురుకుదనం తగ్గి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వయసుకు తగినంత నిద్ర కూడా తప్పనిసరి. సరిపడా నిద్ర లేకపోతే ఆకలిని నియంత్రించే హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని, పిల్లలు అవసరానికి మించి ఆహారం తీసుకునే అవకాశం పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పిల్లలు నిజంగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే ఆహారం ఇవ్వాలి. టీవీ లేదా మొబైల్ చూస్తూ తినే అలవాటును ప్రోత్సహించకూడదు. కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంటున్నారు.. ఇక పిల్లల్లో ఊబకాయాన్ని ప్రారంభ దశలోనే నియంత్రిస్తే భవిష్యత్తులో టైప్-2 డయాబెటీస్, అధిక రక్తపోటు, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు..

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#diabetes#children#habits#illness
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి