Allu Arjun: ఈ మధ్య మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మాట వినిపించింది. ఇకపై, అల్లు అర్జున్ తన సినిమాలను వీలైనంత తక్కువ రోజుల్లో పూర్తి చేయాలని. అంతేకాదు, ఇప్పటి నుంచి చేసే తన సినిమాల బడ్జెట్ కూడా భారీ స్థాయిలో లేకుండా చూసుకోవాలని. ఇదే, గనక అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయమైతే ఈ విషయంలో ఆయన నిజంగా ఐకాన్ స్టారే. ఇక, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇంతకముందులా ఏళ్ళ తరబడి సినిమా కాకుండా, ఏడాది వరకూ రిలీజైయ్యేలా కూడా మేకర్స్ సూచించాడట.
దీనిలో, భాగంగానే కావచ్చు.. అల్లు అర్జున్ సినిమాలు వరుసగా 2027లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే, తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తో 'రాకా' చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని కోలీవుడ్ మీడియా నుంచి అందిన సమాచారం. అంతేకాదు, రెండు భాగాలుగా కూడా ప్లాన్ చేస్తుండగా, మొదటి భాగంలో హీరోయిన్‌గా దీపిక పడుకొన్, రెండవ భాగంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ కనిపించబోతుందని ఒక స్పెక్యులేషన్ జరుగుతోంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఓ కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2027 లోనే అల్లు అర్జున్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. రాకా తో పాటు మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 2027 డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు పక్కా ప్రణాళిక వేస్తున్నాడట. ఒకవేళ డిసెంబర్ కి కుదరకపోయినా, 2028 సంక్రాంతి బరిలో మాత్రం గ్యారెంటీగా దింపాలని మేకర్స్ కి సూచినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. త్వరలో, ఈ ప్రాజెక్ట్ కి సంబదించిన మరిన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయి.












